బాబుకు సోము వీర్రాజు షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-24 17:46:42

బాబుకు సోము వీర్రాజు షాక్

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.. ఏపికి కేంద్రం ఎంత సాయం చేసినా ఎటువంటి నిధులు ఇవ్వ‌లేదు అని అన‌డం చాలా హాస్యాస్ప‌దం అని అన్నారు.. టాయిలెట్ల నూ ఆసాంతం నాకేసిన నాయ‌కులు అని, తెలుగుదేశం నాయ‌కులు అన్నింటా అవినీతికి పాల్ప‌డ్డారు అని విమ‌ర్శ‌లు చేశారు.....దక్షిణాది అని మాట్లాడే బాబు సీమకు, ఉత్తరాంధ్రకు ఏమిచ్చాడు? అని విమ‌ర్శించారు..
చంద్ర‌బాబు అవినీతి ప‌రుడు కాబ‌ట్లే కేంద్రం ఆయ‌న్ని న‌మ్మ‌డం లేదు  అని విమ‌ర్శించారు. 
 
ఇప్ప‌టికీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్నారు సోము వీర్రాజు, అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అది సాధ్యమయ్యే అవకాశమేలేదన్నారు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మట్టి నుంచి ఇసుకదాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆఖరికి బడిపిల్లల టాయిలెట్ల కోసం ఇచ్చిన నిధులను కూడా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఆసాంతం నాకేశారని మండిపడ్డారు.
 
తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నాడని పేర్కొన్నారు,పోల‌వ‌రం ప‌ట్టిసీమ అన్ని ప్రాజెక్టుల్లో అవినీతి జ‌రిగింది అని విమ‌ర్శించారు.. రాయలసీమ ప్రాజెక్టులు అవినీతికి నిలయంగా మారాయని సోము వీర్రాజు విమ‌ర్శించారు.
 
పట్టిసీమలో అవినీతి తవ్వడానికి గునపలు చాలవు. ఒక ట్రాక్టర్ మట్టి తీయడానికి 4 లక్షల తినేస్తున్నారు. పట్టిసీమ 1125 కోట్ల నుంచి మొదలై 1667 కోట్లకు వెళ్ళింది. 24 పంపులు వేసి, 30 పంపులకు లెక్కలు కట్టారు. టెండర్లలో లేనివాటికి కోట్లు కుమ్మరించారు. మట్టి పేరుతో 67 కోట్లు నొక్కేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ఒక్కో ఇంటికి రూ.20 వేలు వసూళ్లు చేస్తున్నారు. కొత్త   పింఛన్ కు మూడు నెలల డబ్బులు ముందే తీసుకుంటున్నారు. నీరుచెట్టు ఓ నాటకం అని ఇది అంద‌రికి తెలిసిందే అని ఆయ‌న విమ‌ర్శించారు
 
ఆఖరికి స్కూళ్లలో ఆడపిల్లల కోసం కట్టిన టాయిలెట్ల నిర్వహణలోనూ చంద్రబాబు అండ్‌ కో నిధులు నాకేస్తున్నారని  వీర్రాజు ఫైర్ అయ్యారు. ఇటు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో తెలుగుదేశం పై బీజేపీ విమ‌ర్శ‌ల దాడి పెంచింది అనే చెప్పాలి.... సోము వీర్రాజు ఎక్క‌డా త‌గ్గేలా లేరు అని అంటున్నారు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.