ఆత్మ‌హ‌త్య‌లే చేసుకోవాలి సోమువీర్రాజు సంచ‌ల‌న కామెంట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

somuverraju
Updated:  2018-03-31 04:13:29

ఆత్మ‌హ‌త్య‌లే చేసుకోవాలి సోమువీర్రాజు సంచ‌ల‌న కామెంట్

తెలుగుదేశం పార్టీలో నాలుగేళ్లు అన‌వ‌స‌రంగా క‌లిసి ప‌నిచేశాము అనేబాధ‌లో ఉన్నారు బీజేపీ నాయ‌కులు... ఈ అవినీతి మ‌ర‌క‌లు మాకు అంటుకున్నాయి అని వారు విమ‌ర్శిస్తున్నారు.. ఇక రాయ‌ల‌సీమ‌పై బీజేపీ ఫోక‌స్ చేస్తోంది, ఇటీవ‌లే రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించింది. ఇక బీజేపీ నాయ‌కులు రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ తెలుగుదేశాన్ని తూర్పార‌బెడుతున్నారు.
 
ఇక సీఎం చంద్ర‌బాబు పై విమర్శ‌లు చేస్తూ బీజేపీలో దూసుకుపోతున్న ఎమ్మెల్సీ  సోము వీర్రాజు, తాజాగా బాబు పై మ‌రింత ఫైర్ అయ్యారు..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమపై సవితిప్రేమ చూపిస్తున్నారని ఆయ‌న ఎద్దెవా చేశారు.. కాని బీజేపీ రాయ‌ల‌సీమ పై క‌న్న‌బిడ్డ ప్రేమ చూపిస్తోంది అని ఆయ‌న అన్నారు.
 
పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఎలాగైతే పూర్తి చేస్తామని అంటున్నారో,  అలాగే రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు... క‌చ్చితంగాఉక్కు ప‌రిశ్ర‌మ వ‌స్తుంది అని తెలియ‌చేశారు ఆయ‌న‌... కడప విమానాశ్రయంలో ఎవరి వల్ల విమానాలు తిరుగుతున్నాయో ప్రజలకు బాగా తెలుసునని, దానిపై కూడా టీడీపీ డబ్బా కొట్టుకోవడం దారుణమని అన్నారు. చేయ‌ని ప‌నులు కూడా చేశాము అని చెప్పుకునే పార్టీ తెలుగుదేశం అని ఆయ‌న అన్నారు.
 
కేంద్ర ప్రభుత్వంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుని, ఒక్క పనైనా పూర్తి చేశారా అని చంద్రబాబు సర్కారును నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి, అక్రమాల్లో మునిగిపోయిందని, క్షేత్రస్థాయిలో ఏ పని చేయకపోయినా.. చంద్రబాబు సర్కారు డబ్బా కొట్టుకుంటుందని విమర్శించారు... రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు ఆయ‌న త‌న‌యుడు ప‌రిపాల‌న చేసుకుంటున్నారు అనివారిద్ద‌రి క‌నుసైగ‌ల్లో రాష్ట్రం న‌డుస్తోంద‌ని అన్నారు.. ఏపీ స‌ర్కారు అవినీతితో నిండిపోయింది అని ఆయ‌న విమ‌ర్శించారు.
 
రాష్ట్ర ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు అన్ని పనుల్లో  కమీషన్ల కోసం అవినీతికి పాల్పడుతున్నారని, కేవలం యూనిఫామ్‌లు కుట్టించడానికి రూ. 16 కోట్ల రూపాయల కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. గతంలో ప్యాకేజీ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ మళ్లీ ముఖ్యమంత్రి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు కేంద్రం రూ. 1050 కోట్లు విడుదల చేసిందని, కానీ ఆయా జిల్లాల్లో అభివృద్ధి మాత్రం శూన్యమని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేసి.. ఇప్పుడేమో కేంద్రం నిధులు ఇవ్వలేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నిధుల కు సంబంధించి నిజానిజాలు అన్ని బ‌య‌ట‌ప‌డ‌తాయి అని ఆయ‌న అన్నారు.
 
ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగుదేశంతో మ‌ద్దతు కొన‌సాగించి చాలా త‌ప్పు చేశాం వారి వ‌ల్ల ఎన్నో అవ‌మానాలు చిత్ర‌హింస‌లకు గురిఅయ్యాం...ఇంకా కొనసాగి ఉంటే ఆత్మహత్యలే శరణ్యం అయ్యేది. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం అని స‌టైర్ విసిరారు  సోము వీర్రాజు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.