హోదా కోసం కదం తొక్కిన ప్రవాసాంధ్రులు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu image
Updated:  2018-03-04 01:14:49

హోదా కోసం కదం తొక్కిన ప్రవాసాంధ్రులు...

ప్రత్యేక హోదా ఆంధ్రుల హాక్కు అనే నినాదంతో ప్ల కార్డులు పట్టి వైసీపీ కమిటీ సభ్యులు, ప్రవాసాంధ్రులు రాష్ట్ర ప్రభుత్వంపై, చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసాలపై విరుచుకుపడ్డారు...
 
చంద్రబాబు తన స్వార్ధం కోసం   కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని..... ముఖ్యమంత్రి పిట్టలదొర మాదిరి ప్రగల్భాలు పలకడమే గాని, రాష్ట్ర ప్రజలకు చేసింది  మాత్రం సూన్యం.... జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్ప పాదయాత్రలో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ   ప్రత్యేక హోదాపై పోరాడుతున్న తీరు హార్షణీయమని, అభినందనీయమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావ‌డంతో పాటు,  ప్ర‌జ‌లంద‌రికీ  సంక్షేమ పధకాలు అందాలంటే 2019 లో జగన్ మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత అవసరం ఎంతోఉందని,  అందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు 2019 లో వైసీపీ గెలుపుకు కృషి చేయాలనీ కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు...
 
దివంగత ముఖ్యమంత్రి మహా నాయకులు వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కొరకు ఏర్పాడిన పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అని, అన్ని కులాలకు, మతాలకు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. రాష్ట్రంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక హోదా కొరకు జరిగే ప్రతి కార్యక్రమములో ప్రజలు స్వచ్చందంగా పాల్గోని, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న తెలుగు దేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పత్రిక ముఖంగా ప్రజలకు మనవి చేశారు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ ఎస్సి, ఎస్టీ, విభాగం ఇంచార్చ్  బి.ఎన్. సింహ.
 
పార్లమెంటు లో తలుపులు మూసి రాష్ట్రాన్ని  విడగొట్టి,  చీకటిలోకి తోసారు.... ఈ కారు చీకటి  పోవాలి అంటే ప్రత్యేక హోదా ఒక్కటే అని గల్ఫ్ ప్రవాసాంధ్రులు నమ్మకం. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సజీవంగా ఉంది అంటే అది మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి  పోరాటం వలనే అని మేము  గర్వంగా  చెప్పగలం. ప్రత్యేక హోదా వలన ఏమి లాభం లేదు.... ప్యాకేజి నే ముద్దు అన్న బాబు.....  ఎన్నికలు సమీపించడంతో యు టర్న్ తీసుకోని మళ్ళి ప్రత్యేక హోదా కావాలి అంటూ..... మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించడానికి కుటిల ప్రయత్నం చేస్తున్నారంటూ  కువైట్ వైసీపీ కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి ఫైర్ అయ్యారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.