స్పీక‌ర్ కోడెల త‌న‌యుడు పోలీస్ స్టేష‌న్లో హ‌ల్ చ‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

speaker kodela son
Updated:  2018-09-19 10:52:15

స్పీక‌ర్ కోడెల త‌న‌యుడు పోలీస్ స్టేష‌న్లో హ‌ల్ చ‌ల్

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి న్యాయం అనే ప‌దాన్ని ఆ పార్టీ నాయ‌కులు రాష్ట్రంలో క‌నిపించ‌కుండా చేశార‌ని ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిత్యం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు. అయితే ఇందుకు ప్ర‌త్య‌క్ష సాక్ష్యం తాజాగా జ‌రిగిన ఘ‌ట‌ననే.. అధికార‌ పార్టీకి చెందిన అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ కుమారుడు శివ‌రామ‌కృష్ణ పోలీస్టేష‌న్ లో హ‌ల్ చ‌ల్ చేశారు. మీకు ఎంత ధైర్యం ఉంటే మా వ‌ర్గీయుల‌నే అరెస్ట్ చేస్తారా అంటూ శివ పోలీసుల‌పై చిందులు తొక్కారు. వెంట‌నే త‌మ‌ వ‌ర్గీయుల‌ను పోలీస్ అధికారులు విడుద‌ల చెయ్యాలిన ఆయ‌న డిమాండ్ చేశారు.
 
వినాయ‌కచ‌వితి నిమ‌ర్జ‌నం సంద‌ర్భంగా గ్రామంలో టీడీపీ, వైసీపీ వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ చోటుచేసుకుంది. ఇక అక్క‌డే  ఉన్న పోలీసులు ఎవ‌రిపై ఎవ‌రు దాడిచేశార‌నే విష‌యాల‌ను పరిగ‌ణ‌లోకి తీసుకుని పోలీస్ అధికారులు టీడీపీ వ‌ర్గీయుల‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించారు. దీంతో త‌మ వ‌ర్గీయుల‌ను విడుద‌ల చేయాలంటూ టీడీపీ నేత‌లు పోలీస్ స్టేష‌న్ కు చేరుకున్నారు. 
 
ఇదే క్ర‌మంలో అక్క‌డికి చేరుకున్న శిరామ‌ఖృష్ణ డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీలో ఉన్న త‌మ వ‌ర్గీయుల‌ను ఎలా అరెస్ట్ చేస్తార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వెంట‌నే త‌మ పార్టీ నాయ‌కులు విడుద‌ల చెయ్యాల‌ని డిమాండ్ చేశారు ఆయ‌న‌. ఇక ఈ క్ర‌మంలో నిర‌స‌న‌లు ఎక్క‌వ కావ‌డంతో పోలీస్ స్టేష‌న్ ముందు ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇక ఆ త‌ర్వాత డీఎస్పీ స‌ర్ధిచెప్ప‌డంతో టీడీపీ నాయ‌కులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.