బిగ్ బ్రేకింగ్ వైసీపీ ఎంపీల రాజీనామాలు స్పీక‌ర్ ఆమోదం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-06 15:26:51

బిగ్ బ్రేకింగ్ వైసీపీ ఎంపీల రాజీనామాలు స్పీక‌ర్ ఆమోదం

ప్ర‌త్యేక‌ హోదాను డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వీరి రాజీనామాల‌ను స్పీక‌ర్ నేడు ఆమోదించారు. కొద్దిరోజుల క్రితం వీరు లోక్ స‌భ స‌మావేశంలో ఎదో ఆవేశంలో రాజీనామా చేశార‌ని స్పీక‌ర్ తెలిపారు. అందుకే  వీరి రాజీనామాల వ్య‌వ‌హారంలో వైసీపీ ఎంపీలకు సుమిత్ర మ‌హాజ‌న్ కొన్నిరోజుల పాటు ఆలోచించుకుని త‌మ‌కు తెలపాల‌ని తెలియ‌జేశారు. 
 
అయితే స్పీక‌ర్ కేటాయించిన స‌మ‌యం నేటితో ముగీయనున్న క్ర‌మంలో ఈ రోజు ఉద‌యం 11 గంట‌లకు వైసీపీ ఎంపీలు స్పీక‌ర్ కార్యాల‌యంలో స్పీక‌ర్ ను క‌లిసి త‌మ రాజీనామాల‌ను ఆమోదించాల‌ని మ‌రోసారి వైసీపీ ఎంపీలు కోరారు. అయితే వారి కోరిక మేర‌కు స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ ఐదు మంది వైసీపీ ఎంపీల‌ రాజీనామాల‌ను ఆమోదించారు. అలాగే అధికార ప్ర‌లోభాల‌కు అశ‌ప‌డి క‌ర్నూల్ జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎంపీల‌పై కూడా స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకోనున్నారు.
 
ఈ ఇద్ద‌రిపై స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్ చ‌ర్య‌లు తీసుకున్న త‌రువాత మ‌రి కొద్ది రోజుల్లో ఏపీలో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది. స్పీక‌ర్ త‌మ రాజీనామాల‌ను ఆమోదించిన త‌ర్వాత వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, తాము ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం మాట మార్చేదిలేద‌ని స్పీక‌ర్ కు చెప్పామ‌ని,అప్పుడు సుమిత్ర‌మ‌హాజ‌న్ రీక‌న్ఫ‌ర్మేష‌న్ లేఖను కోరార‌ని కాసేప‌ట్లో ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని రాజీనామా చేసిన ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. 
 
త‌మ‌కు ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని, అందుకే తాము క‌లిసిక‌ట్టుగా ఉన్నందుకే త‌మ రాజీనామాల‌ను స్పీక‌ర్ ఆమోదించార‌ని తెలిపారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్రబాబుకు త‌గినంత బుద్ధి చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. Good Decision...by Elections lo TDP poti pedite vallu AP ki Special Status ooruki Stefani ardham...appudu AP prajalu nijam telusu kovalo evaru nijam gaaa AP ki Special Status kosham poradutunnaru telusukuni...YCP MP lani Record majority to gelipiste appudu ina BJP nayakulu kallu terisi AP ki Special

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.