వైసీపీ ఎంపీల రాజీనామాలు స్పీక‌ర్ ఆమోదం మ‌రికొద్ది రోజుల్లో వార్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-22 15:04:23

వైసీపీ ఎంపీల రాజీనామాలు స్పీక‌ర్ ఆమోదం మ‌రికొద్ది రోజుల్లో వార్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విభ‌జ‌న చ‌ట్టంలో పొందురిచిన‌ ప్ర‌త్యేక హోదా ఏపీకి ప్ర‌క‌టించాల‌ని కోరుతూ నాలుగు సంవ‌త్స‌రాల నుంచి పోరాడున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా అవ‌రావ‌తిని వేదిక‌గా చేసుకుని వైఎస్ జ‌గ‌న్ త‌న ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా నిరాహార దీక్ష చేశారు.
 
అయితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎక్క‌డ రాష్ట్ర ప్ర‌జ‌లు త‌న పార్టీకి దూరం అవుతారోన‌ని గ్ర‌హించి దీక్ష చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అధికార బ‌లంతో రాష్ట్రానికి ప్ర‌ధాని మోడీ వ‌స్తున్నార‌ని చెప్పి ఈ దీక్ష‌ను భ‌గ్నం చేయించారు.
 
ఇక జ‌గ‌న్ అంత‌టితో ఆగకుండా పార్ల‌మెంట్ చివ‌రి స‌మావేశాల్లో కూడా వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిల‌తో పార్ల‌మెంట్ లో ప్ర‌త్యేక హోదా సెగ‌లు రేపించారు. అంతేకాదు చివ‌రి స‌మావేశం రోజున  వైసీపీ ఎంపీలంద‌రితో జ‌గ‌న్ వారి ప‌ద‌వులకు రాజీనామా చేయించి ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేయించిన సంగ‌తి తెలిసిందే
 
ఇక వారి రాజీనామాల‌పై గ‌తంలో స్పీక‌ర్ చ‌ర్చించారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఆవేశంతో రాజీనామాల‌ను చేశార‌ని అయితే ఈ రాజీనామాల‌పై ఒక్క‌సారి చ‌ర్చించుకోవాల‌ని స్పీక‌ర్ ఎంపీల‌ను కోరారు. త‌మ రాజీనామాల పై ఎటువంటి వెన‌క‌డుగు వేయ‌మ‌ని స్పీక‌ర్ ను క‌లిసి తెలియ‌చేశారు వైసీపీ ఎంపీలు. ఇక వీటిపై పున‌రాలోచ‌న చేసి స్పీక‌ర్ సుమిత్ర మ‌హజ‌న్ నేడు వారి రాజీనామాల‌ను ఆమోదించారు.
 
కాగా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా ప‌ది నెల‌లు స‌మ‌యం ఉంది. ఈ లోపు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మార‌నుంది. ఒకవేళ‌ జ‌రిగితే ఏపీలో వార్ వ‌న్ సైడ్ అవ్వ‌డం ఖాయం... చూద్దాం ఏం జ‌రుగుతుందో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.