చంద్ర‌బాబుకు పోటీగా టీడీపీ మంత్రి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-18 17:30:33

చంద్ర‌బాబుకు పోటీగా టీడీపీ మంత్రి

గుంటూరు జిల్లాలోని చిల‌కలూరి పేటలో ప‌త్తి, పొగాకు పంట‌ల‌కు ప్ర‌సిద్ది చెందిన నియోజ‌క‌వ‌ర్గం. జిల్లాకు 40 కిలోమీట‌ర్లు దూరం ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం నాలుగు మండ‌లాలు ఉన్నాయి. చిల‌క‌లూరిపేట టౌన్, చిలుక‌లూరిపేట రూర‌ల్, నాదెండ్ల‌, య‌డ్ల‌పాడు మండ‌లాలు ఉన్నాయి. ఈ మండ‌లాల్లో జ‌నాభా 2 ల‌క్ష‌ల 78 వేల‌112 ఓట్లు ఉండ‌గా మొత్తం ఓట‌ర్ల సంఖ్య  2,ల‌క్ష‌ల 1,068 ఓట్లు ఉన్నాయి. ఇక ఈ ఓట్ల‌ను కులాల వారిగా చూస్తే క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు 48వేల 372 ఓట్లు ఉండ‌గా వీరి త‌ర్వాత ఎస్సీ ఓట్ల సంఖ్య 44వేల 514 ఓట్లు ఉన్నాయి.
 
ఈ రెండు వ‌ర్గాల త‌ర్వాత ముస్లింలు, కాపు సామాజిక వ‌ర్గాల వారు అభ్య‌ర్థుల గెలుపు, ఓట‌ముల‌పై ప్ర‌భావం చూపుతున్నారు. అయితే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసిన ప్ర‌త్తిపాటి పుల్లారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పైన 10వేల 684 ఓట్ల ఆధిక్యంతో గెల‌పొందారు. టీడీపీ ప్ర‌భుత్వంలో మొద‌ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన పుల్లారావుపైన అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 
 
ఆ త‌ర్వాత జ‌రిగిన పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఆయ‌న పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి అయ్యారు. అయితే ఈ నాలుగేళ్ల‌లో ప్ర‌త్తిపాటి పుల్లారావు త‌న చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గానికి మంచినీరు స‌ర‌ఫ‌రా చేయ‌డానికి వంద ఎక‌రాల చెరువు ఉంది. కానీ స‌ర‌ఫ‌రాకు పైపు లైన్లు ఎక్క‌డా సక్ర‌మంగా లేవు. దీంతో తాగునీరు కోసం జ‌నాలు ట్యాంక‌ర్ల మీదే ఆదార ప‌డాల్సి వ‌స్తోంది. చెరువుకు పైపు లైన్లు స‌క్ర‌మంగా లేవ‌ని చెబుతున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే  వాస్త‌వం వేరేగా ఉంద‌ని తెలుస్తోంది. ప‌ట్టణంలో కృత్రిమంగా తాగునీటి స‌మ‌స్య‌ను సృష్టించి మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు చెందిన ప్ర‌ధాన అనుచ‌రులు సుమారు 20 మంది త‌మ వాట‌ర్ ట్యాంక‌ర్ల‌తో నీటిని స‌ర‌ఫ‌రా చేస్తూ రెండుచేతులా ఫుల్ సంపాదిస్తున్నార‌న్న‌ది స్థానికులు విమ‌ర్శిస్తున్నారు. 
 
అంతేకాదు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామాల స‌మ‌స్య‌ల‌ను చూస్తే అక్క‌డ కూడా ఇలాంటి పరిస్థితే ఏర్ప‌డుతోంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ప‌సుమర్రి గ్రామాన్ని ఆద‌ర్శ గ్రామంగా మారుస్తాను అని ప్ర‌తిపాటి పుల్లారావు ఎంచుకున్నారు. అయితే ప్ర‌స్తుతం  ఈ గ్రామంలో నీటి స‌మ‌స్య అద్వానంగా మారింది. దీంతో గ్రామ‌స్తుల ఇబ్బందుల‌ను చూసి ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు బోర్లు వేయించారు.అయితే ఆ బోర్ల‌ను కూడా పంచాయితీ సిబ్బంది త‌మ హ్యాండ‌వ‌ర్ తీసుకుని వాటిని నిర్వ‌హించ‌లేక మూసేసుకుంది. 
 
చిలుక‌లూరిపేట‌లో ఆటో మొబైల్ ప‌రిశ్ర‌ములు ఎక్కువ ఇక వీరికి ప్ర‌త్యేక ఆటో న‌గ‌ర్ లేక‌పోవ‌డంతో కార్మికులు య‌జ‌మాలు తీవ్ర ఇబ్బందులు ప‌డుత‌న్నారు. ఈ పరిశ్ర‌మ మీద ఆధార ప‌డి సుమారు ప‌ది వేల మంది ఉన్నారు. అంతేకాదు నియోజ‌క వ‌ర్గంలో 30 ప‌డ‌క‌ల ఆసుప‌త్రిని అభివృద్ది చేస్తాన‌ని, అలాగే బ్ల‌డ్ బ్యాంకుల‌ను ఏర్పాటు చేస్తానంటు ఇచ్చిన హామీల‌ను గాల్లో క‌లిపేశారు. పేద‌ల భూముల‌ను ఖాళీ చేయించి అక్క‌డ స్టేడియం నిర్మించాల‌ని మంత్రి పుల్లారావు ప్లాన్ వేశారు. 
 
దీంతో పాటు ప్ర‌తీ చోట రేష‌న్ మాఫియా మ‌ట్టి మాఫియాలు తార స్థాయికి చేరుకున్నాయి. మంత్రి జోక్యంతో ఆయ‌న అనుచ‌రుల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. గతంలో చిలుక‌లూరి పేట‌లో రేష‌న్ మాఫియాల‌పై వార్త‌ల‌ను రాసిన జ‌ర్న‌లిస్ట్ ను కాపుకాసి అతికిరాతంగా చంపేశారు. 
 
మంత్రి పుల్లారావుపై వ‌చ్చిన ఆరోప‌న‌లు అన్నీ ఇన్నికావు వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రిగా ఉన్న స‌మయంలో న‌కిలీ ప‌త్తి విత్త‌నాల కార‌ణంగా రైతులు పెద్ద‌ ఎత్తున న‌ష్ట‌పోయారు. అయితే ఆ విత్త‌నాల‌ను విక్ర‌యించిన కంపెనీల‌ను కేసుల‌పేరుతో బెదిరించి రైతుల‌కు న‌ష్ట‌పరిహారం అందించాలంటూ వారినుంచి భారీగా దోచుకున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.
 
అంతేకాదు సీసీఐలో జ‌రిగిన కుంభ‌కోణంలోనూ పూల్లారావు అనుచ‌రుల‌దే ప్ర‌ధాన పాత్ర. అయితే ప్ర‌స్తుతం ఈ కేసు సీబీఐ విచారిస్తోంది. అయితే ఈ విచార‌ణ‌లో ఇప్ప‌టికే 80మంది ఉద్యోగుల‌పై కూడా చర్య‌లు తీసుకున్నారు. వారిలో 22 మంది అధికారుల‌ను స‌స్పెండ్ చేసి మ‌ళ్లీ ఉద్యోగాలు ఇచ్చారు. అయితే దీనివేనుక కూడా భారీగా ప‌చ్చ నోట్లు మారాయి అనే వాధ‌న వినిపిస్తోంది. 
 
అలాగే య‌డ‌వ‌ల్లి గ్రామంలో కూడా భూముల వ్య‌వ‌హారం జాతీయ స్థాయిలో తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ పేద‌ల‌కు చెందిన 413 ఎక‌రాల ఏక‌ప‌ట్టా భూమిని స్వాదినం చేసుకునేందుకు ప్లాన్ వేశారు. ఈ భూముల్లో పెద్ద ఎత్తున గ్రానైట్ ఉండ‌టంతో ఎస్సీల‌ను ఖాళీ చేయించి ఆ భూముల్లో గ్రానైట్ త‌వ్వ‌కానికి రంగం సిద్దం చేశారు. 
 
అయితే ఎస్సీ, ఎస్టీలంతా క‌లిసి జాతీయ క‌మీష‌న్ కు ఫిర్యాదు చెయ్య‌డంతో క‌మీష‌న్ తీవ్రంగా స్పంధించింది. మంత్రిగా నాలుగు సంవ‌త్స‌రాలుగా పని చేస్తున్న పుల్లా రావు ఏం చేశార‌ని అడిగితే అరాచ‌కాలు అక్ర‌మాలు రెచ్చిపోతున్న మాఫియా వ్య‌వ‌హారాలు త‌ప్ప చెప్పుకోవ‌టానికి ఏం క‌నిపించ‌లేద‌ని వామ‌ప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అభివృద్ది విష‌యంలో లెక్క‌లు చెప్ప‌టంలో సీఎం చంద్ర‌బాబుకు పోటీ అయ్యార‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వాపోతున్నారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో సుఖ సంతోషాల‌తో ఆయ‌న అర‌చేతిలో వైకుంఠం చూపుతున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.