అసంతృప్తితో......

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 11:00:18

అసంతృప్తితో......

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ తీరు న‌చ్చ‌క అనేక మంది రాజ‌కీయ నాయ‌కులు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కూడా వైసీపీ కండువా క‌ప్పుకుంటున్నారు. 
 
ఈ క్ర‌మంలోనే అనంతపురం జిల్లా డీఆర్‌డీఏ చేనేత జౌళిశాఖలో అడిషనల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ... స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తలారి రంగయ్య వైసీపీలో చేరారు.   ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర   ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వర్గం    సాగుతోంది. 
 
బుధ‌వారం పొన్నలూరు మండలం తిమ్మపాలెంలో జరుగుతున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో పాల్గొని జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం   పుచ్చుకున్నారు  తలారి రంగయ్య. 21 సంవత్సరాలుగా రంగ‌య్య  గ్రూప్‌–1 సర్వీసులో బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు నచ్చక  పదవీ విరమణ చేసిన ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.