డ‌బ్బుల క‌ట్ట‌ల‌ను కుమ్మ‌రించింది వీళ్లే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 18:36:22

డ‌బ్బుల క‌ట్ట‌ల‌ను కుమ్మ‌రించింది వీళ్లే

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయ‌కులు, అభిమానులు మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను నిర్వ‌హించిన‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స‌భ‌ను టీడీపీ నాయ‌కులు మూడు రోజుల పండుగ‌లాగ నిర్వ‌హించి మొన్న విజ‌య‌వాడ‌లో పూర్తి చేశారు.అయితే గ‌తంలో ఈ స‌భా ముఖంగా టీడీపీ నాయ‌కులు ఫేమస్ అవ్వ‌డానికి ఇత‌ర టీడీపీ నాయ‌కులను ఏ విధంగా విమ‌ర్శించుకున్నారో సాధార‌ణ ప్ర‌జ‌ల కంటే ఈ స‌భ‌ల‌కు హాజ‌రు అయిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కే పూర్తిగా తెలుసు.
 
అయితే ఈ మేర‌కు మొన్న విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో  నిర్వ‌హించిన ముగింపు మహానాడు స‌భ‌ల‌కు టీడీపీ నాయ‌కులు కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించార‌ట‌. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, వచ్చిన వారికి సరైన వసతులను కల్పించి ఈ మహానాడు స‌భ‌ను విజయవంతం చేశారు.
 
అయితే వీట‌న్నింటి ఖ‌ర్చును ఆ పార్టీ నాయ‌కులే భ‌రించార‌ట‌. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులు రెడ్డి సుమారు 25 ల‌క్ష‌ల రూపాయాల‌ను విరాళంగా ఇచ్చి మ‌హానాడు స‌భ‌కు హీరో అయ్యారు. ఆ త‌ర్వాతి స్థానంలో మంత్రి శిద్ధా రాఘవరావు మరియు టీడీపీ నేత రఘురామకృష్ణం రాజులు క‌లిసి చెరో 20 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చి రెండో స్థానంలో నిలిచార‌ని స‌మాచారం. ఇక చివ‌రిగా క‌ర్నూల్ జిల్లాకు చెందిన టీజీ వెంక‌టేష్ ప‌ది ల‌క్ష‌లు ఇచ్చి మూడో స్థానంలో నిలిచార‌ని విశ్లేష‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఇక మిగిలిన నాయ‌కులు వారి స్థాయిలో ముడుపుల‌ను అందించార‌ట‌. మొత్తం మీద టీడీపీ నాయ‌కులు ఈ స‌భ‌కు సుమారు ప‌ది కోట్ల‌కు పైనే ఇచ్చార‌ట‌.
 
అయితే ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నాయి. చంద్ర‌బాబు ఈ మ‌హానాడు స‌భ‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. కేవ‌లం ప్ర‌జాధ‌నాన్ని ఎలా ఖ‌ర్చుపెట్టాల‌నే ఉద్దేశ్యంతో వారు ఇలాంటి  స‌భ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని వైసీపీ మండిప‌డుతోంది. ఈ స‌భ‌కు కేటాయించిన డ‌బ్బంతా ఒక జిల్లాకు కేటాయిస్తే రాష్ట్రంలో కొద్దివ‌ర‌కు అయినా ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గుతాయ‌ని ప్రతిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.