పవన్ రాజ‌కీయంపై శ్రీరెడ్డి మ‌రో బాంబ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-09-15 11:21:10

పవన్ రాజ‌కీయంపై శ్రీరెడ్డి మ‌రో బాంబ్

తెలుగు చిత్రప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ పేరుతో అమాయ‌క ప్ర‌జ‌ల‌పై లైంగిక వేదింపులు జ‌రుగుతున్నాయంటూ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని శ్రీరెడ్డి సంచ‌లం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంపై మ‌రో బాంబ్ పెల్చింది. తాజాగా సైబాబాద్ లో ఓ బేక‌రి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాని హాజ‌రు అయ్యారు శ్రీరెడ్డి.
 
ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ, కొద్దికాలంగా సోష‌ల్ మీడియాలో తాను 2019 ఎన్నిక‌ల్లో రాజ‌కీయ అరంగేట్రం చేస్తున్నానంటు వార్త‌లు వ‌స్తున్నాయని, అయితే అందులో వాస్త‌వం లేవ‌ద‌ని శ్రీ స్ప‌ష్టం చేశారు. అస‌లు త‌న‌కు రాజ‌కీయాల్లోకి రావ‌డానికి ఆస‌క్తేలేద‌ని అన్నారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీలోకి రావాలంటూ రెండు పార్టీలు త‌న‌ను ఆహ్వానిస్తున్నాయ‌ని శ్రీరెడ్డి అన్నారు.
 
 2019లో జ‌న‌సేన పార్టీ ఏపీలో కేవ‌లం నాలుగు లేక ఐదు సీట్ల‌కు మాత్ర‌మే పరిమితం అవుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కళ్యాణ్ కు ఘోర ప‌రాభావం త‌ప్ప‌ద‌ని అన్నారు. మ‌రి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌లపై ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందింస్తారో వేచి చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.