తెలుగుదేశం ఆస్ధాన‌మీడియాకి కంగాటి శ్రీదేవి కౌంట‌ర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

cherukulapadu-sridevi
Updated:  2018-02-24 12:40:53

తెలుగుదేశం ఆస్ధాన‌మీడియాకి కంగాటి శ్రీదేవి కౌంట‌ర్

వైఎస్సార్‌సీపీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య రాష్ట్రంలో  సంచ‌ల‌నం రేపింది.  ప్ర‌జా స‌మ‌స్య‌ల పై ప్ర‌భుత్వంతో నిత్యం పోరాడుతూ ప్ర‌జాద‌ర‌ణ పోందిన నాయ‌కుడు నారాయ‌ణ రెడ్డి. ప‌త్తికొండ  నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి చేస్తున్న అక్ర‌మాల‌పై ప్ర‌త్యర్ది నాయ‌కుడు చెరుకులపాడు నారాయణ ప్ర‌జా క్షేత్రంలో గ‌ళం విప్పేవారు. 
 
అయితే గ‌త యేడాది మే నెల‌లో అనుచ‌రుడి వివాహానికి హ‌జ‌రై తిరిగి వ‌స్తున్న ప్ర‌యాణంలో నారాయ‌ణ రెడ్డి హ‌త్య‌కు గురైన విష‌యం అంద‌రికి తెలిసిందే.  ఈ హ‌త్య కేసులో కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబును డోన్ కోర్టు నిందితుడిగా చేర్చింది. చెరుకులపాడు నారాయణరెడ్డి హ‌త్య కేసులో నిందితుడిగా ఉన్న కేఈ శ్యాంబాబుకు హైకోర్టు నుంచి ఊర‌ట ల‌భించిందని  టీడీపీ ఆస్థాన మీడియాలో రావ‌డాన్ని పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ కంగాటి శ్రీదేవి ఖండించారు.
 
కంగాటి శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ నారాయణరెడ్డి హ‌త్య కేసులో కేఈ శ్యాంబాబుకు హైకోర్టు నుంచి ఊర‌ట ల‌భించిందని వ‌స్తున్న వార్త‌ల‌ను  కోర్టు దృష్టికి తీసుకెళ్తామని కంగాటి శ్రీదేవి తెలిపారు. కేఈ కుటుంబం అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర జ్యోతి పత్రికలో వచ్చిన కథనానికి కేఈ కృష్ణమూర్తి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. మీడియా బాధ్య‌తాయుతంగా న‌డుచుకుని త‌న గౌర‌వాన్ని నిలుపుకోవాల‌ని ఆమె అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.