పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-09-28 03:11:34

పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. టీడీపీ ఎమ్మెల్యే

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గాన‌కి  ర‌హ‌దారి, సూదీర్ఘ‌ స‌ముద్ర తీరం ప్ర‌ధాన ఆక‌ర్ష‌న‌లు. 2 ల‌క్ష‌ల 10వేల 400 మంది ఓట‌ర్లు ఉన్న ఈ  నియోజ‌క‌వ‌ర్గంలో ర‌ణస్థ‌లం, లావేరు, ఎచ్చెర్ల , గంగువారి శిగ‌డాం మండలాలు ఉన్నాయి. ఈ నియోజ‌క‌వర్గంలో తూర్పు కాపులు  మ‌త్స్య‌కారులు కాళింగుల ఓట్లు అభ్య‌ర్థుల‌పైన గెలుపు ఓట‌మిల‌పై ప్ర‌భావం చూపుతాయి.
 
ఇక్క‌డ ఉద్యాన వ‌నాలు వ్య‌వ‌సాయ రంగంపై ఆదార‌ప‌డిన వారు ఎక్కువ‌. ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రాష్ట్ర‌టీడీపీ అధ్య‌క్షుడు మంత్రి కిమిడి క‌ళా వెంక‌ట‌రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కుడు అయిన క‌ళా వెంక‌ట‌రావు సొంత నియోజ‌క‌వ‌ర్గం రాజాం అయితే అది ఎస్సీ రిజ‌ర్వుడు కావ‌టంతో ఆయ‌న ఎచ్చెర్ల‌కు వ‌ల‌స వ‌చ్చి తొలిప్ర‌య‌త్నంగా 2009లో ప్ర‌జా రాజ్యంనుంచి పోటీచేసి ఘోర ప‌రాజ‌యం పొందారు. 
 
ఇక ఇదే క్రమంలో 2014లో పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన గొర్లె కిర‌ణ్ కుమార్ పైన 4వేల 741 ఓట్ల ఆదిఖ్య‌త‌లో టీడీపీ నుంచి క‌ళా ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న ఎమ్మెల్యే అయ్యాక తొలి మూడు సంవ‌త్స‌రాలు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని అల‌కలో ఉండిపోయిన కిమిడి ప్ర‌జల‌కు ఇచ్చిన‌ హామీలు నిర్ధాక్ష‌ణంగా గాలికి వ‌దిలేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
 
అధికార పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్ప‌టికి పేరు గొప్ప ఊరు దిబ్బ నావ‌ల్ల ఏం ప‌నులు అవుతాయి అనే దిగులుతో కాలం గ‌డిపేశారు క‌ళా. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో మంత్రి అయినా త‌ర్వాత త‌న నియోజ‌క‌వ‌ర్గం గురించిఆలోచించారా అంటే దాని ఊసే ఎత్త‌లేదు అంటున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను, అలాగు ఆ త‌ర్వాత వేసిన శంకుస్థాప‌న‌ల‌ను గుర్తు చేసుకోకుండా కాలం గ‌డిపేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.
 
దీంతో టీడీపీ హామీల‌ను ఒక్క‌సారి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు గుర్తు చేస్తే చాలు వారికోపం తారాస్థాయికి చేరుకుంటోంది. క‌ళా సొంత నియోజ‌క‌వ‌ర్గం కాదు క‌నుక ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గంపైచిన్న చూపు చుస్తున్నార‌ని గ్రామ‌స్తులు మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.