శ్రీకాంత్ రెడ్డి స‌వాల్ ఛాలెంజ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-28 02:03:51

శ్రీకాంత్ రెడ్డి స‌వాల్ ఛాలెంజ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల తూటాలు వ‌దులుతారు తెలుగుదేశం నేత‌లు...జ‌గ‌న్  పేరు చెబితే వెంట‌నే విమ‌ర్శ‌లు చేసే నాయ‌కులు తెలుగుదేశం లో చాలా మంది ఉన్నారు... ఇక జ‌గ‌న్ కు స‌న్నిహితుడు రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పై విమ‌ర్శ‌లు చేస్తారు అదే పందాలో తెలుగు తమ్ముళ్లు.. ప్ర‌తీ దానికి జ‌గ‌న్ కు లింక్ పెట్టి విమ‌ర్శ‌లు చేయ‌డంలో తెలుగుదేశం నాయ‌కుల‌ను మించిన వారు లేరు అంటారు వైసీపీ నాయ‌కులు.. ఓ ప‌క్క మీడియాలు కూడా బాబుకు కొన్నివ‌త్తాసు ప‌ల‌కడం తెలిసిందే... తెలుగుదేశం నాయ‌కులు ఎటువంటి క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నా పార్టీ అధినేత వారిపై ఎందుకు  చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు అనేది ఇప్ప‌డు చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం.
 
ఇక అధికంగా ఏపీలో ప్రాజెక్టుల‌కు నిధులు ఖ‌ర్చుచేస్తున్నాము అని చెబుతున్న తెలుగుదేశం పార్టీ, అక్క‌డ జ‌రుగుతున్న మోసాలు అవినీతి ఆధారాల‌ను ఎందుకు ప‌ట్టించుకోడం లేద‌ని, క‌మీష‌న్ల చుట్టూ వీరి రాజ‌కీయం తిరుగుతోంది అని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.. తాజాగా రాయ‌చోటి ఎమ్మెల్యే మంత్రి దేవినేని ఉమ‌కు స‌వాల్ చేశారు.
 
ప్రాజెక్టుల పేర్లు చెప్పి తెలుగుదేశం నాయ‌కులు  అడ్డ‌గోలుగా దోచుకుంటున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.. అస‌లు డీపీఆర్ లు లేని ప‌నులు చేస్తున్నారు అని... కాని రాష్ట్రంలో ఏ ప‌నిచేయ‌కుండా బిల్లులు క్లియ‌రెన్స్ కు పంపుతున్నారు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు... కావాల‌నే వెలిగొండ ప్రాజెక్ట్ ఎస్టిమేష‌న్లు పెంచి దోచుకుంటున్నార‌ని అందిన కాడికి దోచుకోవ‌డం నాయ‌కుల‌కు అలవాటుగా ప‌రిపాటిగా మారింది అని అన్నారు.
 
ప్ర‌తీదానికి నానా యాగి చేసే తెలుగుదేశం, ద‌మ్ముంటే ప్రాజెక్టుల్లో జ‌రుగుతున్న అవినీతి పై చ‌ర్చ‌కు రావాలి అని ఆయ‌న పిలుపునిచ్చారు.. ఈ ప్రాజెక్టుల్లో జ‌రుగుతున్న అవినీతి పై తాము చ‌ర్చ‌కు సిద్ద‌ము అని అన్నారు.. సాక్ష్యాధారాల‌తో తాము చూపిస్తామ‌ని మంత్రి దేవినేని సిద్ద‌మా అని అన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ..రైతుల‌పై ఈ ప్ర‌భుత్వానికి ఎటువంటి ప్రేమ‌లేద‌ని చంద్ర‌బాబు రాజ‌కీయం అటువంటిదే అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.