శ్రీకాంత్ రెడ్డి క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-07 17:41:17

శ్రీకాంత్ రెడ్డి క్లారిటీ

ఏపీకి ప్ర‌త్యేకహూదా వ‌స్తే ఏం అభివృద్ది జ‌రుగుతుంది కేవ‌లం ప్ర‌త్యేక ప్యాకేజీతో అమ‌రావ‌తిని నిర్మిద్దాం అని కేంద్రం ద‌గ్గ‌ర ఏపీ ప్ర‌త్యేక హూదాని తాక‌ట్టు పెట్టారు సీఎం చంద్ర‌బాబు అంటారు వైసీపీ నాయ‌కులు... ఇక ప్ర‌జ‌ల్లోకి కూడా ఈ ప్ర‌త్యేక హూదా అంశం బాగా నాటుకుపోయింది... ముందు ప్ర‌త్యేక హూదా కావాలి అన్న చంద్ర‌బాబు త‌ర్వాత ప్ర‌త్యేక ప్యాకేజీకి జై కొట్టారు...
 
ఆ త‌ర్వాత ప్ర‌త్యేక హూదా అంటే జైలే అన్నారు.. చివ‌ర‌కు ఉద్య‌మాలు కూడాచేయ‌కుండా కేంద్రం ద‌గ్గ‌ర మెప్పు పొందారు... అయితే చివ‌ర‌కు ఆ ప్ర‌జ‌లు ప్ర‌త్యేక హూదా సెంటిమెంట్ ను వ‌ద‌ల‌క‌పోవ‌డంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డంగా ఇరక్కుంది అని వైసీపీ విమ‌ర్శిస్తోంది... ప్ర‌జ‌లు నిల‌దీయ‌డంతో ప్ర‌శ్నిండంతో ఇక చేసేది ఏమీ లేక, మ‌రోసారి అధికారంలోకి రాము అని కేంద్రానికి క‌టీఫ్ చెప్పి మ‌ళ్లీ ప్ర‌త్యేక హూదా అంటున్నారు.
 
ఇక వైసీపీ చేస్తే దారుణం ఇది ప‌ద్ద‌తి కాదు అనే చంద్ర‌బాబు, త‌న‌కు తానుగా రాజకీయం చేయ‌డానికి ధ‌ర్మ‌పోరాట దీక్ష అని ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు అని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.. తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సీఎం చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు..
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. బీజేపీని రాష్ట్రానికి రెండో శత్రువుగా, కాంగ్రెస్‌ని మూడో శత్రువుగా భావిస్తున్నామన్నారు. మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా.. టీడీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.
 
టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తుందని గుర్తుచేశారు. టీడీపీని కూడా చంద్రబాబు సర్వనాశనం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా పేరిట ధర్మ పోరాట మంటూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. మొత్తానికి తెలుగుదేశం పొత్తులు అని ప్ర‌చారం చేయ‌డం,  వైసీపీ వాటిని తిప్పికొట్ట‌డం ఈ తెలుగుదేశం మార‌దు అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.