చంద్ర‌బాబుపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrp mla srikanth reddy and chandrababu
Updated:  2018-10-31 01:25:57

చంద్ర‌బాబుపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిన్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వ‌హించిన స‌భ అధ‌ర్మ‌పోరాట స‌భ అని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయ‌చోటి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికి చంద్ర‌బాబు మళ్లీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ప్రొద్దుటూరులో నిర్వ‌హించిన స‌భ‌కు సుమారు ఆరు జిల్లాల నుంచి టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించార‌ని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాదు ఈ స‌భ‌ల‌కు చంద్ర‌బాబు నాయుడు సుమారు 50కోట్ల ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేశార‌ని శ్రీకాంత్ మండిప‌డ్డారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ధ‌ర్మం నీతి, న్యాయం పాటించ‌లేని ఘ‌నత‌ చంద్ర‌బాబు నాయుడుకు ద‌క్కుతుంద‌ని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
 
అధ‌ర్మానికి ముఖ్య‌మంత్రి బ్రాండ్ అంబాసిడ‌ర్ అని ఎద్దేవా చేశారు. త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం చేసి అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మాన‌వ‌త్వంలేని వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడు అని శ్రీకాంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఆయ‌న‌కు రైతులు క‌ష్టాలు ప‌ట్ట‌వ‌ని, నాలుగు సంవ‌త్స‌రాల నుంచి రాయ‌ల‌సీమలో రైతులు మ‌ర‌ణిస్తున్నా కూడా ఇవి చంద్ర‌బాబుకు క‌న‌ప‌డ‌వ‌ని ఆరోపించారు. తాను రాష్ట్ర ముఖ్య‌మంత్రి అని చెప్పుకోవ‌డానికి చంద్ర‌బాబు సిగ్గుప‌డాల‌ని శ్రీకాంత్ రెడ్డి అ