బాబు పొత్తుల‌కు శ్రీకాంత్ రెడ్డి కొత్త‌పేరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

srikanth reddy and chandrababu naidu
Updated:  2018-09-07 03:40:41

బాబు పొత్తుల‌కు శ్రీకాంత్ రెడ్డి కొత్త‌పేరు

తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌జా తీర్పు కోసం ముందుకు వెళ్తున్నార‌ని, ఆయ‌న ప‌రిపాల‌న మీద ఆయ‌న‌కున్న‌ న‌మ్మ‌కంతో ముందుకు పోతున్నార‌ని, కానీ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో పొత్తు అని చెప్పి సమావేశాల‌ని ఏర్పాటు చేసుకుంటున్నార‌ని ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో య‌దావిధిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పొత్తుల కోసం లీకులు ఇస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.
 
తెలుగుదేశం పార్టీలో సిద్దాంతాలు ఉండ‌వ‌ని శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ లౌకిక పార్టీనా లేక  మ‌త‌త‌త్వ పార్టీనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల ముందు అన్ని పార్టీల‌ను చంద్ర‌బాబు నాయుడు క‌లుపుకుంటార‌ని ఎన్నికలు అయిపోయిన త‌ర్వాత ఆయ‌నకు ఏది లాభ‌మో ఆ పార్టీని క‌లుపుకుంటూపోతార‌ని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
 
అయితే ఇదే క్ర‌మంలో మొద‌టిసారిగా చంద్ర‌బాబు నాయుడు 1995లో ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత లోక్ స‌భ‌కు సాధార‌ణ ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల‌తో క‌లిసి పోటీ చేశార‌ని గుర్తు చేశారు. అప్పుడు మ‌త‌త‌త్వ పార్టీల‌కు వ్య‌తిరేకంగా పోటీ చేస్తున్నామ‌ని చెప్పారు. అలాగే 1999 ఎన్నిక‌