బీజేపీకి స్టార్ హీరో గుడ్ బై ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

narendra modi bjp
Updated:  2018-03-29 12:00:55

బీజేపీకి స్టార్ హీరో గుడ్ బై ?

దేశంలో ప‌లు రాష్ట్రాల్లో విక్ట‌రీల‌తో దూసుకుపోతున్న బీజేపీ తాజాగా ప‌లు ఎంపీ సెగ్మెంట్ల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మిరుచిచూసిన విష‌యం తెలిసిందే పెద్ద నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్ బీజేపీకి దేశవ్యాప్తంగా వ్య‌తిరేక ప‌వ‌నాలు చూపుతోంది అంటున్నారు. అయితే ఇప్ప‌డు తాజాగా బీజేపీకి ఓ పెద్ద స్టార్ హీరో గుడ్ బై చెబుతున్నారు అని తెలుస్తోంది.
 
బీజేపీకి ఎంపీ శత్రుఘ్న సిన్హా షాకివ్వనున్నారట‌.....ఈ మేరకు ఆయన మీడియాకు  స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీ తనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, 2019 ఎన్నికల్లో వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సిన్హా వెల్ల‌డించారు.. పార్టీలో త‌న‌కు గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని అధికార పార్టీ చ‌ర్య‌ల పై ఆయ‌న ఫైర్ అయ్యారు...నరేంద్ర దామోదర్‌ దాస్‌, మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీజేపీ తనను చిన్నచూపు చూస్తోందని ఆయ‌న వ్యాఖ్యానించారు.
 
అయితే త‌న‌కు అనేక పార్టీలు వెల్ కం చెబుతున్నాయి అని ఆయ‌న అన్నారు.. త‌న‌కు ఏ పార్టీ అయినా టికెట్ ఇవ్వ‌డానికి రెడీగా ఉంది  అని ఆయ‌న తెలియ‌చేశారు..పార్టీ నుంచి టికెట్‌ తీసుకున్నా పాట్నా పార్లమెంటు నియోజవర్గం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు.. 2014 లో బీజేపీ తనకు టికెట్‌ ఇవ్వబోవడం లేదనే పుకార్లు వచ్చాయని, అలాగే 2019 లో కూడా టికెట్ త‌న‌కు ఇవ్వ‌రు అనేలా పుకార్తు  వ‌స్తున్నాయి అని అన్నారు ఆయ‌న‌.
 
ఇక చివ‌ర‌గా మ‌రో స‌టైర్ వేశారు పార్టీ పై.. మొద‌టి నుంచి పార్టీని భుజస్కంధాలపై వేసుకుని రెండు నుంచి 200 సీట్లకు తీసుకొచ్చిన ఎల్‌కే అద్వాణీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరికీ తెలుసని అన్నారు. పార్టీలోని కొందరు వ్యక్తులు ఇతరులను చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు... మొత్తానికి సీనియ‌ర్లు అంద‌రూ ఇలా త‌లోదారి చూసుకుంటున్నారు అని కాషాయ పార్టీలో అల‌జడి అయితే మొద‌లైంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.