స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

stephen hawking image
Updated:  2018-03-14 03:14:22

స్టీఫెన్ హాకింగ్ క‌న్నుమూత‌

భౌతిక శాస్త్ర‌వేత్త భౌతికంగా దూరం అయ్యారు ..ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్  కన్నుమూశారు.ఈరోజు  ఉదయం ఆయన కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు స్టీఫెన్‌ కుటుంబ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఖమా నాన్న ఈ రోజు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఇది అత్యంత బాధాకరం  అని స్టీఫెన్‌ పిల్లలు లూసీ, రాబర్ట్‌, టిమ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
 
స్టీఫెన్‌ పూర్తి పేరు స్టీఫెన్‌ విలియమ్‌ హాకింగ్‌. 1942 జనవరి 8న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన స్టీఫెన్‌.. భౌతికశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు. కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌కు ఉత్పత్తి చేస్తాయని ధ్రువీకరించారు. దీన్నే హాకింగ్‌ రేడియేషన్ అని కూడా పిలుస్తారు.
 
అయితే ప్రమాదవశాత్తు ఆయన నరాల వ్యాధికి గురయ్యారు. 21ఏళ్ల వయసులోనే చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు.. 1963లో ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే రోజుల్లో ఆయన శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. అదే సమయంలో ఆయన ఒక రోజు మెట్ల మీద నుంచి పడిపోయారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. స్టీఫెన్‌ పరిస్థితిని గమనించి కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను సంప్రదించారు.
 
ఆయన మోటార్‌ న్యూరాన్‌ వ్యాధికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. దీని వల్ల శరీరం నెమ్మదిగా పక్షవాతానికి గురవుతుంది. ఆ సమయంలో ఆయన కేవలం రెండేళ్లే బతుకుతారని చెప్పారు... ఓ కమ్యూనికేషన్‌ డివైజ్‌ ద్వారా ఆయన సంజ్ఞలు అక్షర రూపంలోకి మారేవి. కొన్నాళ్లకు ఆ చేయి కూడా పక్షవాతానికి గురికావడంతో 2005 నుంచి తన చెంప కండరాలతోనే కమ్యూనికేషన్‌ డివైజ్‌ను కంట్రోల్‌ చేశారు.
 
అలా దశాబ్దాల పాటు చక్రాల కుర్చీలోనే గడిపిన స్టీఫెన్‌ బుధవారం తుదిశ్వాస విడిచారు.భౌతికశాస్త్రంలో ఐన్‌స్టీన్‌ తర్వాత అంత గొప్ప శాస్త్రవేత్తగా హాకింగ్‌ పేరుగాంచారు. కృష్ణబిలాలు, బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతంపై ఆయన చేసిన అద్భుత పరిశోధనలు నేటి తరం శాస్త్రవేత్తలకు మార్గదర్శనం చేస్తాయి ఇక అలాగే గ్ర‌హాంతర వాసుల ఉనికి పై ఆయ‌న చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లు మాన‌వాళికి ముప్పుగా ప‌రిణ‌మిస్తాయి అని పులుసార్లు హెచ్చ‌రించారు.. ప్ర‌పంచ శాస్త్ర‌వేత్త‌లు ఆయ‌న మృతి ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేసి నివాళులు అర్పిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.