దమ్ము, ధైర్యం టీడీపీకి లేదా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-03 10:46:03

దమ్ము, ధైర్యం టీడీపీకి లేదా?

ప్రతిపక్షం వైసీపీ పైన, అధినేత జగన్ మోహన్ రెడ్డి పైన ఎప్పుడూ  విరుచుకుపడటానికి టీడీపీలో కొందరు నాయకులూ ఉంటారు...వాళ్లలో ఒకరు దేవినేని ఉమామహేశ్వర్ రావు...ఆయన జగన్ పేరు తలుచుకోకుండా ఉండలేరు...పోలవరం విషయంలో కూడా 2018 మార్చిక‌ల్లా  పోలవరాన్ని పూర్తి చేస్తామని జగన్ కి సవాల్ విసిరారు...2018 వచ్చేసరికి ప్రతిపక్షానికి విసిరినా సవాలుకి సమాధానం చెప్పలేక కొద్ది రోజులు జగన్ నామాన్ని వదులుకొని మీడియా ముందుకు రాకుండా తిరిగాడు.
 
జగన్ పాదయాత్ర టీడీపీ కంచుకోట అయిన కృష్ణాజిల్లాకు చేరుకోవడం,అక్కడ జగన్ కి ప్రజలు బ్రహ్మరధం పడుతుంటే టీడీపీ అధినేత నుండి అందరికి వణుకు వచ్చింది..విజయవాడలో కనకదుర్గమ్మ వారధిపై జగన్ పాదయ్రాతలో వచ్చిన జనసముహంతో కనకదుర్గమ్మ వారధి కదిలింది....ఈ కదలికలతో టీడీపీ నాయకులూ హడలిపోయారు...అందుకే మళ్లీ జగన్  నామం చేయడానికి దేవినేని మీడియా ముందుకు వచ్చి వైసీపీని, టీడీపీని విమర్శించడం మొదలుపెట్టాడు.
 
ఈ విమర్శలపై వైసీపీ అధికార ప్రతినిది సుధాకర్ బాబు మండిపడ్డారు... కనకదుర్గమ్మ వారధి కదలడంతో టీడీపీ నాయకుల ఫాంట్లు, లుంగీలు, డ్రాయర్లు తడిచిపోయాయి అని అన్నారు...మీరు జగన్ గురించి మాట్లాడేది అని దేవినేని ఉమపై ఫైర్ అయ్యారు సుధాకర్ బాబు... మీరు పట్టిసీమలో చేసిన అవినీతి గురించి మేము చెప్పనక్కర్లేదు ఎందుకంటే కాగ్ చెప్పింది కాబట్టి...మీ అన్న చనిపోయినప్పుడు, మీ వదిన ఎందుకు చనిపోయిందో మేము చెప్పనక్కరలేదు అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా...పోలవరంపై సవాల్ విసిరావు ఇప్పుడు పోలవరం పేరే ఎత్తడం లేదు...వైసీపీకి దమ్ము ,ధైర్యం లేదు అంటున్నావు...అది అనాల్సింది నువ్వు కాదు మేము...టీడీపీకి, మీ నాయకుడికి దమ్ము, ధైర్యం ఉంటే  పట్టిసీమ అవినీతిపైన విచారణకు సిద్ధమా? నీరు - చెట్టు పేరుతో మీరు చేస్తున్న మోసాలపై విచారణకు సిద్ధమా? పోలవరంలో జరిగిన అవినీతిపైనా విచారణకు సిద్ధమా? అని దేవినేని ఉమకు సవాల్ విసిరారు వైసీపీ అధికార ప్రతినిది సుధాకర్ బాబు...
 
బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని పచ్చ మీడియా చేత ప్రచారం చేయిస్తున్నారు...టీటీడీ లో బీజేపీ మంత్రి భార్యకు బోర్డు మెంబెర్ పదవిని అప్పగించి మళ్లీ మా మీద బురదజల్లడానికి టీడీపీకి సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు...మీ నాయకుడు ఇక్కడేమో పచ్చ మీడియాతో బీజేపీతో విడాకులు, ఢిల్లీని వణికిస్తాం అంటారు...ఢిల్లీకి వెళ్తే మేము ఇంకా బీజేపీతో సంసారం చేస్తున్నాం అంటారు...మీ నాయకుడికి వెన్నుపోటు రాజకీయం, ఊసరవెల్లి రాజకీయం తప్ప, ఇసువంతైనా నిజాయతి ఉందా అని మండిపడ్డారు సుధాకర్ బాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.