డిల్లీలో సుజ‌నా ప‌రువు తీసిన సాయి రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-08 04:21:34

డిల్లీలో సుజ‌నా ప‌రువు తీసిన సాయి రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర బ‌డ్జెట్ లో జ‌రిగిన అన్యాయంపై ఉభ‌య‌స‌భ‌ల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ కొన‌సాగుతోంది. పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ఇస్తామ‌న్న వాటిని  అమ‌లు చేయాల్సిందేనంటూ టు తెలుగుదేశం పార్టీ, ఇటు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావ‌డం శుభ‌ప‌రిణామం అనే చెప్పాలి. 
 
గురువారం నాడు జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ...తాము లేవ‌నెత్తిన అంశాల‌పై మ‌రో 15 రోజుల్లోగా క్లారిటీ ఇవ్వాల‌ని, లేని ప‌క్షంలో వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనైనా విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ని చ‌ర్చించేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. 
 
ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి  ప్ర‌సంగంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డ‌ర్ లేవ‌నెత్తారు. కేంద్ర మంత్రిగా బ‌డ్జెట్ ను ఆమోదించిన సుజ‌న ఇప్పుడు స‌భ‌లో బ‌డ్జెట్ ను వ్య‌తిరేకించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. కేంద్ర‌మంత్రి వ‌ర్గంలో ఉంటూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని  ఎలా ప్ర‌శ్నిస్తార‌ని విజ‌య‌సాయి రెడ్డి నిల‌దీశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.