జైట్లీతో ర‌హ‌స్య భేటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sujana chowdary arun jaitley
Updated:  2018-03-23 11:45:41

జైట్లీతో ర‌హ‌స్య భేటీ

నాడు ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓడిస్తాన‌ని కాంగ్రెస్ లో చెప్పిన చంద్ర‌బాబు, పార్టీ మారి వెంట‌నే తెలుగుదేశంలో చేరిన చంద్ర‌బాబు రాజ‌కీయాల గురించి మాకు చెబుతున్నారా?  మాది పిల్ల కాంగ్రెస్ అని పిలిచే చంద్ర‌బాబుకు  ముందు అదే కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయ బిక్ష పెట్టింది అని గుర్తు చేసుకోవాలి అని వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది.. ఇటు తెలుగుదేశం ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది, ఏపీలో తెలుగుదేశం నుంచి ఇద్ద‌రు కేంద్ర మంత్రులు వైదొలిగారు. కేంద్రం పై పోరాడాలి అవ‌స‌ర‌మైతే కేంద్రం పై యుద్దం చేద్దాం మ‌న‌కు న్యాయం జ‌ర‌గాలి అని ఇక్క‌డ చంద్ర‌బాబు చెబుతున్నారు, మ‌రో ప‌క్క వారి పార్టీ నాయ‌కులు కేంద్ర‌మంత్రుల‌తో ర‌హ‌స్య ఒప్పందాలు చేసుకుంటున్నారు అని విమర్శ‌లు వ‌స్తున్నాయి.
 
ఇక్క‌డ ప్ర‌త్యేక హూదా కోసం పోరాటం అని చెబుతూ కేంద్రం మెడ‌లు వంచుతాం అని చెబుతూ మీరు  చేసే రాజ‌కీయం ఏమిటి అని ప్ర‌శ్న‌లేవనెల్తుతున్నారు నాయ‌కులు... ఏపీలో  ప్ర‌త్యేక హూదా కోసం పోరాటం చేస్తున్నాము అని చెబుతున్నారు తెలుగుదేశం నాయ‌కులు, అయితే అదే పందాలో వైసీపీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పీఎంవో లో ఎందుకు తిరుగుతున్నారు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
అస‌లు సాయిరెడ్డి ఏమి చేస్తున్నారో తెలుగుదేశానికి ఎందుకు అంత ఆతృత..? ఎవ‌రికి అంతుచిక్క‌ని ప‌రిస్తితి తెలుగుదేశానిది?  29 సార్లు ప్ర‌ధానిని క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధించ‌ని చంద్ర‌బాబు, జ‌స్ట్ ఓ ఎంపీకి ఇంత ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు అని ప్ర‌శ్న లెవ‌నెత్తుతున్నారు వైసీపీ నాయ‌కులు.
 
తెలుగుదేశానికి హ‌స్తిన‌లో అన్ని చక్క‌బెట్టే నాయ‌కుడు సుజ‌నా చౌద‌రి, అయితే ఇప్పుడు ఆయ‌న బీజేపీ కీల‌క నేత ఆర్దిక‌ మంత్రి అరుణ్ జైట్లీతో ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు అనే స‌మాచారం టీడీపీలో క‌ల‌వ‌రం రేపింది... ఇప్పుడు అదే పెద్ద చ‌ర్చ‌కు వ‌స్తోంది.. ప్ర‌త్యేక హూదా పోరాటానికి ఇక ప‌ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.. అయితే ఇప్పుడు ప్యాకేజీకి మ‌ళ్లీ మెగ్గుచూపుతున్నారు అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు తెలుగుదేశం నాయ‌కులు  అని అంటున్నారు నాయ‌కులు.
 
రహ‌స్య భేటీ దేనికి ప్ర‌త్యేక ప్యాకేజికి ఎస్ చెప్ప‌డానికేనా అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు నాయ‌కులు. ఇటు వైసీపీ కూడా అంటోంది మ‌ళ్లీ బీజేపీ తెలుగుదేశం క‌లిసినా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు అని ఈ సీన్ చూస్తుంటే రాజ‌కీయం ఇలానే ఉంది అంటున్నారు నాయ‌కులు. ఇక కేంద్రం కూడా పోల‌వ‌రానికి ఇందులో మైత్రి బంధం భాగంగా 1400 కోట్లు కేటాయించింది అనే వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.. ఇక ఆస్ధాన మీడియాలు కూడా తెలుగుదేశం బీజేపీకి మ‌ధ్య మ‌రింత వార్ ను న‌డ‌ప‌డం లేదు, దీంతో బీజేపీకి మ‌ళ్లీ తెలుగుదేశం ద‌గ్గ‌ర అవుతుంది అని అంటున్నారు నాయ‌కులు మేధావులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.