విభ‌జ‌న హామీల‌పై చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sujana chowdary
Updated:  2018-07-24 04:24:13

విభ‌జ‌న హామీల‌పై చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌పై ఈ రోజు రాజ్య‌భ‌లో స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌ను నిర్వ‌హించారు. ఈ చ‌ర్చ‌లో టీడీపీ కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ, విభ‌జ‌న హామీల విష‌యంలో ఏపీకి తీవ్ర‌స్థాయిలో అన్యాయం జ‌రిగింద‌ని ఆయ‌న స్పీక‌ర్ కు వివ‌రించారు.
 
ఇంకా ఏం చెప్పారంటే...
 
- ఏపీ ప్ర‌జ‌లు భ‌విత‌వ్యం అంద‌కారంలోకి ప‌డింది. 
-  నాలుగేళ్లుగా కేంద్రం అన్నిర‌కాలుగా ఆదుకుంటుంద‌ని ఏపీ ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. 
- యూపీఏ హయాంలో రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని ఇచ్చిన హామీను ప‌ట్టించుకోలేదు.
- విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల అమ‌లుకు నోచుకోలేదు.
- మూకదాడుల త‌ర‌హాలోనే ఏపీపై కేంద్రం వ్య‌వ‌హరిస్తోంది.
- విభ‌జ‌న అన్యాయం కేంద్రం ఏపీ మీద చేసిన మూక దాడి.
- స‌హ‌కార స్పూర్తికి విఘాతం క‌లిగించేలా.. కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంది.
- ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని మోడీ మూడు సార్లు హామీ ఇచ్చారు.
- రాష్ట్రాల ప‌ట్ల కేంద్రం భాద్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. 
- రాజ్యస‌భ‌లో ఇచ్చిన హామీలు, చ‌ట్టాలు ఎందుకు అమ‌లు కావ‌డం లేదు.
- మంత్రి వ‌ర్గ నిర్ణ‌యాల‌ను కేంద్రం తుంగలో తొక్కింది.
- మంత్రి వ‌ర్గంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా చేయ‌ట్లేదు.
- 16వేల కోట్ల రెవిన్యూలోటుతో రాష్ట్రం విడిపోయినా కేంద్రం మాత్రం 4వేల కోట్లేన‌ని అంటుంది.
-  కేంద్రం త‌న అధికారంతో ఏపీకి రావాల్సి అన్ని వ‌న‌రుల‌ను అడ్డుకుంటోందని చెప్పి త‌న ప్రసంఘాన్ని సుజ‌నా చౌద‌రి ముగించుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.