టీడీపీకి గుడ్ బై

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-28 14:06:52

టీడీపీకి గుడ్ బై

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకి షాక్ మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి... 2014 ఎన్నిక‌ల్లో అధికారాన్ని ద‌క్కించుకున్న చంద్ర‌బాబు త‌న ప్ర‌లోభాల‌తో ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  నాయ‌కుల‌ను రాజ్యంగాని విరుద్దంగా వ్య‌వ‌హ‌రించి వారిని పార్టీలోకి చేర్చుకున్నారు...
 
పార్టీలోకి చేర్చుకోవ‌డ‌మే కాకుండా వారికి ఉన్న‌త ప‌ద‌వుల‌ను అప్ప‌గించారు... దీంతో ఎప్ప‌టి నుంచో టీడీపీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కుల‌కు ప‌ద‌వుల‌ను ఇవ్వ‌కుండా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డంతో చంద్ర‌బాబు పై టీడీపీ నాయ‌కులు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.
 
ఇక తాజాగా ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌ యాత్ర‌కు ప్ర‌జ‌లే కాకుండా టీడీపీకి చెందిన కీల‌క నేత‌లు కూడా జ‌న‌నేత‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు... అయితే ఈ క్ర‌మంలో టీడీపీ చెందిన కీల‌క నేత‌లు కూడా త‌మ ఫ్యూచ‌ర్ రాజ‌కీయాలను దృష్ట్యా  జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.. అయితే ఇప్ప‌టికే టీడీపీ నాయ‌కులు య‌ల‌మంచిలి ర‌వి వైసీపీ తీర్థం తీసుకున్నసంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా చంద్ర‌బాబు  క‌నీ విని ఎరుగ‌ని రీతిలో మాజీ కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి... ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదాను కేంద్రం ప్ర‌క‌టించ‌లేని నేప‌థ్యంలో చంద్ర‌బాబు బీజేపీ మిత్ర‌ప‌క్షానికి క‌టిఫ్ చెప్పారు... దీంతో పాటు కేంద్ర‌మంత్రులుగా నియ‌మించిన సుజ‌నా చౌద‌రి, అశోక్ గ‌జ‌ప‌తి రాజుల‌తో వారి ప‌ద‌వులుకు చంద్ర‌బాబు రాజీనామా చేయించి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.
 
అయితే ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అశోక్ గ‌జ‌ప‌తి రాజు రాజీనామా చేసినా, సుజ‌నా చౌద‌రి మాత్రం రాజీనామా చేసేందుకు సంకోచించార‌ని వార్త‌లు వ‌చ్చాయి... తాను రాజీనామా చేయనని మంత్రిగా కొనసాగుతానని ఆయన చంద్ర‌బాబుతో పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది... దీంతో చంద్ర‌బాబు సుజనాచౌదరి రాజీనామా చేయకపోతే తన పరువు, పార్టీ ప్రతిష్ఠ మంటగలిసి పోతాయని, చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించార‌నే మాట వినిపించింది
 
అయితే పార్టీ అధిష్టానం నిర్ణ‌యం మేర‌కు రాజీనామా చేసినా కానీ ఆ త‌ర్వాత సుజ‌నా చౌద‌రి పార్టీ నాయ‌కుల‌కు దూరంగా  వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నార‌ట‌... కాగా ఈ నేప‌థ్యంలో ప‌లువురు కీల‌క నేత‌ల‌తో చ‌ర్చించి త‌న త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను పాటించ‌నున్నార‌ని తాజా రాజ‌కీయ విశ్లేష‌కుల స‌మాచారం...  ఈ క్ర‌మంలో సుజానా చౌదరి బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నార‌ట‌... ఈ మేర‌కు అరుణ్ జైట్లీతో సమావేశం కావడం కూడా జరిగిందట‌..అయితే ప్ర‌స్తుతం ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అమ‌రావ‌తిలో తీవ్రంగా చ‌ర్చిస్తున్నార‌ట‌.
 
మ‌రోవైపు ఇదే అశంపై టీడీపీ నాయ‌కుల మీడియాకు కంట‌ప‌డ‌కుండా అత్య‌వస‌ర స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది... ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులు కేంద్రంపై పోరాటం చేస్తుంటే సుజ‌నా చౌద‌రి ఇలా ఎవ‌రికి తెలియ‌కుండా బీజేపీ నాయ‌కుల‌తో ర‌హ‌స్యంగా క‌ల‌వ‌డంపై టీడీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది... వీరితోపాటు చంద్ర‌బాబుకూడా షాక్ గురి అయిన‌ట్లు తెలుస్తోంది... మొత్తానికి చంద్ర‌బాబు కు తెలియ‌కుండా పార్టీ నాయ‌కులు వారి ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల కోసం   వేరే పార్టీలోకి మారేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.