సుజ‌నా రివ‌ర్స్..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-23 03:33:33

సుజ‌నా రివ‌ర్స్..?

కేంద్ర బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం పై అన్ని రాజ‌కీయ పార్టీలు పోరుబాట ప‌ట్టాయి. ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీనే మిత్ర‌ప‌క్షంగా ఉంటూ, కేంద్రం పై మండిప‌డుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీని ప్ర‌శ్నిస్తోంది. దీంతో ఇత‌ర ప‌క్షాలు అన్ని ఏపీపై బీజేపీని ఇరుకున పెడుతున్నాయి... ఇక రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా ముందుకు వెళుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వ‌క‌పోతే అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డానికి రెడీ అవుతున్నారు.. డేట్ కూడా వైసీపీ ప్ర‌క‌టించ‌డంతో తెలుగుదేశం స‌ర్కార్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవాలో తెలియ‌క డైల‌మాలో ప‌డింది.
 
ఇక తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు త‌న ఎంపీల‌ను ఇద్ద‌రిని కేంద్ర మంత్రి వ‌ర్గంలో కొనసాగిస్తున్నారు. ఒక‌రు  కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కాగా, మ‌రొక‌రు సుజ‌నాచౌద‌రి అయితే రాజ్య‌స‌భ నుంచి నామినేట్ అయిన ఎంపీగా సుజ‌నా కొన‌సాగుతున్నారు.. ఇక మోదీ కేబినెట్లో ఇరువురు కేంద్ర‌మంత్రులుగా కూడా కొన‌సాగుతున్నారు. ఒక‌వేళ వైసీపీ అవిశ్వాస తీర్మానంపెడితే వారికి స‌పోర్ట్ చేయ‌క‌పోతే.. ఏపీలో దోషులుగా ఆ పార్టీ నిల‌బ‌డుతుంది. అందుకే తెలుగుదేశం అధినేత వైసీపీ అవిశ్వాసానికి ముందే ఓ భారీ ప్లాన్  వేశారు.. కేంద్ర మంత్రిగా కొన‌సాగుతున్న సుజ‌నా చౌద‌రి చేత రాజీనామా చేయించి ముందు కేంద్రానికి ఓ ఝ‌లక్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు.
 
అయితే ఇదే విష‌యం సుజ‌నాకి తెలియ‌చేస్తే ఆయ‌న రాజీనామాకు అయిష్ట‌త చూపారు అని తెలుగుదేశం నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు..  రాజీనామా చేస్తే మొత్తానికి కేంద్రంలో మ‌రొక‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తారు కాని, ఏపీకి బీజేపీ ఎటువంటి సాయం చేసే స్దితిలోలేదు అని ఆయన అన్నార‌ట.. అయితే తాము రాజీనామా చేసినా ఏపీకి ఎటువంటి నిధులు కేంద్రం ఇవ్వ‌దు అని ఆయ‌న అన్నార‌ట, దీంతో చంద్ర‌బాబు ఎటువంటి పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ అమ‌లు చేస్తారో చూడాలి.. ఇక మ‌రో మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పార్టీ ఆదేశం ప్ర‌కారం రాజీనామా చేయ‌డానికి సిద్దం అని అన్నార‌ట‌. అయితే రాజీనామాల వార్త ఆస్దాన మీడియాల్లో వైర‌ల్ అవుతోంది..ఇదంతా డ్రామా అంటున్నారు వైసీపీ నాయ‌కులు. తాము అవిశ్వాస తీర్మానం అని ప్ర‌క‌టించ‌గానే, తెలుగుదేశం మేల్కొంది అని స‌టైర్లు వేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.