విజ‌యసాయిరెడ్డి విష‌యంలో సుజ‌నా యూ ట‌ర్న్?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sujana choudari image
Updated:  2018-03-28 12:04:28

విజ‌యసాయిరెడ్డి విష‌యంలో సుజ‌నా యూ ట‌ర్న్?

తెలుగుదేశం నాయ‌కులు చేసే కామెంట్లు చేసే ఆరోప‌ణ‌లు చూస్తుంటే  వైసీపీ నాయ‌కులను టార్గెట్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం ఎంపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్  విజ‌య‌సాయిరెడ్డి పై చేసిన ఆరోప‌ణ‌లు మ‌రింత ఆజ్యం పోశాయి పొలిటిక‌ల్ వార్ కు.. అస‌లు విజ‌య‌సాయిరెడ్డి పీఎంవో చుట్టూ తిరిగితే జ‌రిగేది ఏమిటి.  ప్ర‌ధానిని క‌లిస్తే మీకు వ‌చ్చిన బాధ ఏమిటి అనేది వైసీపీ తెలుగుదేశాన్ని ప్ర‌శ్నిస్తున్న  అంశం... ఇటు బీజేపీ కూడా తెలుగుదేశం వ్యాఖ్యాల‌పై మండిప‌డుతోంది.
 
తెలుగుదేశం పార్టీ నాయ‌కులు కావాల‌నే విజ‌య‌సాయిరెడ్డి పై బుర‌ద‌జ‌ల్లుతున్నారు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అస‌లు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధానికి  న‌మస్కారం  చేస్తే కాళ్లు ప‌ట్టుకున్నారు అని అన‌డం చాలా దారుణం అని అన్నారు. అయితే ఇక్క‌డ వైసీపీ మ‌రో వాద‌న తీసుకువ‌చ్చింది... ఓ వైపు అవిశ్వాస తీర్మానం పెడుతూ సుజ‌నా చౌద‌రి సీఎం ర‌మేష్ ఎందుకు అరుణ్ జైట్లీని క‌లుస్తున్నారు అని ప్ర‌శ్నిస్తోంది. ఓ ప‌క్క సీఎం ర‌మేష్ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని కాళ్లు ప‌ట్టుకున్నారు అని విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు చేస్తుంటే మ‌రో ప‌క్క సుజ‌నా చౌద‌రి వెర్ష‌న్ వేరేగా ఉంది.
 
సుజ‌నా చౌద‌రి విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో సీఎం ర‌మేష్ ఆరోప‌ణ‌ల‌పై ఏమ‌న్నారంటే ?
 
సభలో ఫేర్‌వెల్‌ స్పీచ్‌ ఇచ్చే వరకూ మేమంతా కామ్‌గా ఉంటామని, ఆ తర్వాత నిరసన కొనసాగిస్తామని తెలియజేశాం. ప్రధానమంత్రి సభలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారో కూడా కనిపించలేదు. నేను ప్రధానమంత్రికి నమస్కారం పెట్టానో లేదో నాకైతే గుర్తులేదు. పెద్దవాళ్లు వస్తూ పోతూ ఉన్నప్పుడు నమస్కారం, ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం. అది భారతదేశ సంస్కృతి. పెద్దవాళ్లు కనిపిస్తే దగ్గరికెళ్లి నమస్కారం పెడతాం. అది సహజం, అందులో తప్పులేదు అని అన్నారు మొత్తానికి ఇటు సుజ‌నా చౌద‌రి అటు సీఎం ర‌మేష్ వెర్ష‌న్ వేరు వేరుగా ఉండ‌టం భిన్న‌మైన స‌మాధానాలు రావ‌డం ప‌ట్ల తెలుగుదేశానికి క్లారిటీ లేదా అనే ఆలోచ‌న వ‌స్తోంది ప్ర‌జ‌ల‌కు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.