పొలిటిక‌ల్ కెరీర్ పై సుమ‌న్ క్లారిటీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 01:44:16

పొలిటిక‌ల్ కెరీర్ పై సుమ‌న్ క్లారిటీ

విజయనగరం జిల్లా కేంద్రంలో ఒక‌ బ్యూటీపార్లర్‌ను ఆదివారం ప్రారంభించారు హీరో సుమ‌న్ . కార్య‌క్ర‌మం అనంత‌రం కాసేపు  సుమ‌న్ మీడియాతో ముచ్చ‌టించారు.  అభివృద్దికి  ప్ర‌భుత్వాలు కీల‌క బాధ్య‌త వ‌హించాలని, ముఖ్యంగా  ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించడానికి రాజ‌కీయ నాయ‌కులు  చిత్త‌శుద్దితో   పాల‌న సాగించాల్సిన  అవ‌స‌రం ఎంతైనా ఉందని సుమ‌న్  అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
ప్ర‌జ‌ల త‌రుపున పొరాటం  చేసే వారికి స‌హ‌కారం అందించే అవ‌కాశం ఉన్నా...  ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు సుమ‌న్‌. రాజ‌కీయాల్లో రాణించ‌డానికి క‌నీస అవ‌గాహ‌న ఉండాలి. సినిమాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నంత  మాత్రాన రాజ‌కీయాల్లో రాణిస్తార‌ని అనుకోకూడ‌దని, ఎందుకంటే ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతంగా ఆలోచిస్తున్నారని అన్నారు. 
 
పాల‌న‌లో రైతుల‌కు వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా, యువ‌కుల‌కు నైపుణ్య‌మైన విద్య‌ను అందించి త‌గిన ఉపాధి క‌ల్పించే  అవ‌గాహ‌న ఉన్న ప్ర‌భుత్వాలే రావాలని ఆయ‌న కోరారు.  రాజ‌కీయ ప‌రిజ్ఞానం, ప‌రిపాల‌న విధానాలు ఉన్నందునే ఎంజీఆర్, ఎన్‌టీఆర్‌, జ‌య‌ల‌లిత‌ లాంటి న‌టులు  రాజ‌కీయంగా  రాణించార‌ని అన్నారు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న రజనీ, కమల్ హ‌స‌న్‌ వంటి వారికి  కూడా రాజకీయ పరిజ్ఞానం ఉంద‌ని అన్నారు. 
 
సుమ‌న్ గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు సుమ‌న్ క్లారిటీ ఇచ్చారు.  కాని ఏ  పార్టీ నుండి పోటీ చేస్తార‌నే దానిపై మాత్రం సుమ‌న్ స్పందించ‌లేదు. త్వ‌ర‌లోనే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాను అనే దానిపై ప్ర‌క‌టిస్తాన‌ని సుమ‌న్ మీడియాకు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.