చింత‌మ‌నేనికి మ‌హిళా నేత స‌వాల్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 16:36:49

చింత‌మ‌నేనికి మ‌హిళా నేత స‌వాల్ ?

తెలుగుదేశంలో నిరంత‌రం వార్త‌ల్లో నిలిచే ప్ర‌భుత్వ విప్  ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ తాజాగా ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ కండెక్ట‌ర్ పై దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం దానిని అడ్డుకోబోయిన వ్య‌క్తి పై దాడి చేయ‌డంతో ఇప్పుడు మ‌రింత వార్త‌ల్లో నిలిచారు ఆయ‌న‌.. ఇక సీఎం చంద్ర‌బాబు ఆయ‌న పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు కాబ‌ట్టే ఆయ‌న ఇలా వ్య‌వ‌హారిస్తున్నారు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు నాయ‌కులు.
 
తాజాగా ఈ వివాదం పై ప‌లువురు నాయ‌కులు ఆయ‌న ప‌ద్ద‌తి పై విమ‌ర్శ‌లు  చేస్తున్నారు...దమ్ము, ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలని టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కి సవాల్ విసిరారు..  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ.... ఆమె ఓ ఆర్టీసీ బ‌స్సు పై ఉన్న సీఎం చంద్ర‌బాబు ఫోటో చింపి వేశారు ఇప్పుడు నేను ఫోటో చింపివేశాను ...హనుమాన్‌ జంక్షన్‌కి వచ్చి తనపై దాడి చేయాలంటూ చింతమనేనికి సవాల్ విసిరారు ఆమె ... సీఎం చంద్రబాబు తన పెంపుడు కుక్కలను ప్రజలపై దాడికి వదులుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
చింత‌మ‌నేని వ్య‌వ‌హారం పై ఇంత మంది ప్ర‌శ్నిస్తున్నా, కంప్లైంట్లు వ‌స్తున్నా, జైలు శిక్ష ప‌డినా ఎందుకు చంద్ర‌బాబు మౌనం వ‌హిస్తున్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు..ఇలా దాడులు చేసే చింత‌మ‌నేని వ‌దిలి సామాన్యుల‌పై మీ ఝులం చూపిస్తారా అని ఆమె ప్ర‌శ్నించారు..రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని సుంకర పద్మశ్రీ విమ‌ర్శించారు.మ‌రి ఇప్పుడు చింత‌మ‌నేని ఆమె స‌వాల్ పై ఏమాట చెబుతారో ఆయ‌న స్పంద‌న ఏమిటో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.