జ‌గ‌నే సెక్ట్స్ సీఎం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 13:00:01

జ‌గ‌నే సెక్ట్స్ సీఎం

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మకు చెందిన హీరో సూప‌ర్ స్టార్ కృష్ణా త‌న జ‌న్మ దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ ప్ర‌ముఖ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ఎండ, వాన, గ‌లి, ఇలాంటివి ఏవి లెక్క‌చేయ‌కుండా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌చేస్తున్నార‌ని, నిజంగా ఆయ‌న పాద‌యాత్ర చేయ‌డం చాలా గొప్ప‌విష‌యం అని సూప‌ర్ స్టార్ కృష్ణ తెలిపారు.ఈ ఎర్ర‌ని ఎండ‌లో ఏ రాజ‌కీయ నాయ‌కుడు రోడ్డు మీద క‌నిపించ‌డం లేద‌ని కేవ‌లం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే ఎండ‌లో క‌నిపిస్తున్నార‌ని కృష్ణ తెలిపారు.
 
దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అలాగే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనూ త‌న‌కు ఎప్ప‌టినుంచో అనుబంధం ఉంద‌ని తెలిపారు. ఈ అనుబ‌ధంతోనే స‌మ‌యం దోరికితే నేను వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి వ‌చ్చేవారినని గుర్తు చేశారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జా సేవ ల‌క్ష్యంగా చేసుకుని రాష్ట్రం మొత్తం పాద‌యాత్ర చేశార‌ని ఈ పాద‌యాత్ర‌లో ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం క‌నిపించార‌ని, మ‌ళ్లీ ఇప్పుడు ఈ జ‌నాన్ని జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చూస్తున్నాన‌ని కృష్ణ స్ప‌ష్టం చేశారు.
 
జ‌గ‌న్ కు వాళ్ల  నాన్న‌లాగ ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని, వారి క‌ష్టాల‌ను తీర్చాల‌న్న ప‌ట్టుద‌ల ఉంద‌ని ఈ ప‌ట్టుద‌లే ఆయ‌న‌ను 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిని చేస్తుంద‌ని కృష్ణ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టారు. వైఎస్ లాగ జ‌గ‌న్ కూడా మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి కాబ‌ట్టి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జ‌లు అడుగ‌డుగునా ఇసుక వేస్తే రాలనంత జ‌నం క‌నిపిస్తున్నార‌ని తెలిపారు.
 
గ‌తంలో తాను ఎంపీగా ఉన్న స‌మ‌యంలో  వైఎస్‌ కూడా ఎంపీయేనని కృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి చివరివ‌ర‌కు మంచి మిత్రులుగా కొనసాగామని తెలిపారు. ఆయ‌న ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ ప‌థకం రాష్ట్ర ప్ర‌జ‌లకు ఎంతో ఉప‌యోగ ప‌డింద‌ని ఒక్క ఆరోగ్య శ్రీనే ఆయ‌న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌న్ని ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రిగాయ‌ని అందుకు త‌న‌కు వైఎస్ ఇష్ట‌మైన వ్య‌క్తి అని సూప‌ర్ స్టార్ కృష్ట అన్నారు. ఇప్పుడు ఈ ప‌థ‌కాల‌ను తాను మ‌ళ్లీ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక చూస్తాన‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.