దేశ రాజ‌కీయ నాయ‌కులకు సుప్రీమ్ కోర్టు బిగ్ షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

supreme court
Updated:  2018-09-25 12:34:51

దేశ రాజ‌కీయ నాయ‌కులకు సుప్రీమ్ కోర్టు బిగ్ షాక్

అవినీతి ప‌రులు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్య‌త పార్ల‌మెంట్ పైనే ఉంద‌ని సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. క్రిమిన‌ల్స్ ను పార్ల‌మెంట్ కు దూరం పెట్టాల్సిన‌ స‌మ‌యం వ‌చ్చింద‌ని అభిప్రాయ ప‌డింది. ఈ మేర‌కు పార్ల‌మెంట్ చ‌ట్టాలు చేయాల‌ని న్యాయ‌స్థానం సూచిందింది. అయితే చార్జిషీట్ దాఖ‌లు అయినంత మాత్ర‌న ఓ వ్య‌క్తిని అవినీతిప‌రుడుగా గుర్తించ‌లేమ‌ని తేల్చి చెప్పింది. 
 
చార్జిషీట్ ఆధారంగా స‌ద‌రు వ్య‌క్తిని రాజ‌కీయాల్లో పోటీ చేయ‌కుండా అడ్డుకోలేమ‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు. ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారంతా త‌మ‌పై పెండింగ్ లో ఉన్న కేసు వివ‌రాల‌ని త‌ప్ప‌కుండా పేర్కొవాలంది. రాజ‌కీయాల్లో అవినీతి ఆర్థిక ఉగ్ర‌వాదంతో స‌మానం అని అభిప్రాయప‌డింది. రాజ‌కీయ అవినీతిని పార‌దోలేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాలని పేర్కొంది. 
 
భార‌తదేశంలో రాజ‌కీయం ఎప్పుడో నేర‌మ‌యంగా మ‌రిపోయింది. స‌ర్పంచ్ నుంచి ఎంపీ వ‌ర‌కు ప్ర‌జా ప్ర‌తినిధుల్లో చాలామంది నేర చ‌రిత ఉన్న‌వారే. 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో 34 శాతం వివిధ క్రిమిన‌ల్ కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వాళ్లే. అత్యాచార ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటూ కోర్టు చుట్టు తిరుగుతున్న ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా ఉన్నారు. 
 
అయితే ప్ర‌స్తుతం ఉన్న, చ‌ట్టాల ప్ర‌కారం నేరం రుజువు అయితే త‌ప్ప వారు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అర్హ‌త కోల్పోరు. దీనికి సంబంధించి పిటీష‌న‌ర్లు, కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీం లో భిన్న వాదాలు వినిపించాయి. కేవలం ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న కార‌ణంగా ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశాన్ని ఎలా కాల‌రాస్తారని అటార్నీ జ‌న‌రల్ ప్ర‌శ్నించారు. ఇలా చేస్తే ఎన్నిక‌ల్లో పోటీ చేసే హ‌క్కులు వారికి దూరం చేసిన‌ట్లే అని ఆయ‌న వాదించారు. అయితే ట్రైల్ కోర్టులో ఉద్దేశ పూర్వ‌కంగానే  కేసుల‌ను పెండింగ్ లో పెట్ట‌డం వ‌ల్ల నేర‌స్తులు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని ఎన్నిక‌ల వ‌ర‌కు రాకుండా వీరికి అడ్డుక‌ట్ట వెయ్యాల‌న్న‌ది పిటీష‌న‌ర్ల వాద‌న‌. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.