హైకోర్టు విభ‌జ‌న‌పై సుప్రీం కోర్టు నోటీసులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

supreme court
Updated:  2018-08-31 01:44:17

హైకోర్టు విభ‌జ‌న‌పై సుప్రీం కోర్టు నోటీసులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న‌పై కేంద్రం దాఖ‌లు చేసిన పిటీష‌న్ పై తాజాగా విచార‌ణ జ‌రిగింది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఉన్న హైకోర్టులోని భ‌వ‌నాన్నిఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని తెలంగాణ త‌ర‌పున న్యాయ‌వాది సుప్రీం కోర్టుకు నివేదించారు. 
 
ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టులో ఖాళీగా ఉన్న హాళ్ల‌ను వాడుకోవ‌చ్చ‌ని సూచించారు. అంతేకాదు అవ‌స‌రం అయితే తాము  వేరే భ‌వ‌నానికి వెళ్తామ‌ని సూచించారు. కేంద్రం త‌ర‌పున అటార్నిజ‌న‌ర‌ల్ కే.కే వేణుగోపాల్ తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ముఖుల్ రోహ‌గీ వాద‌న‌ల‌ను వినిపించారు. 
 
ఇక ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టుకు సుప్రీం కోర్టుకు నోటీసుల‌ను పంపింది. రెండువారాల్లోగా అభిప్రాయాన్నితెలుపాల‌ని సూచించిన కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌కు రెండువార‌ల పాటు వాయిదా వేసింది. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.