అయోధ్య కేసులో సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

supreme court
Updated:  2018-09-27 03:49:26

అయోధ్య కేసులో సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు

అయోధ్య కేసును విస్రృత ధ‌ర్మాస‌నానికి అప్ప‌గించేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. అన్ని ప్రార్థన ఆల‌యాల‌కు మ‌తాల స్థ‌లాల‌కు స‌మాన గౌర‌వం ఇవ్వాల‌ని తెలిపింది. 1994 నాటి తీర్పును స‌మ‌ర్థించిన సుప్రీం కోర్టు.. అక్టోబ‌ర్ 29 నుంచి విచారించనుంది. రామ మందిరం, బాబ్లీ మ‌సీదు వివాదంలో వివాదాస్ప‌ద స్థ‌లాన్ని మూడు భాగాలుగా చేయాలంటూ 2010లో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటీష‌న్ పై సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా విచార‌ణ‌ సాగుతుంది. 
 
అయితే ఈ వివాదాం 26 సంవ‌త్సారాలుగు కోర్టు మ‌ధ్య న‌లుగుతూనే ఉంది. మ‌రికొన్ని రోజుల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ఈ వివాదానికి ఎలాంటి ప‌రిష్కారం చూపుతార‌నేది ప్ర‌స్తుతం ఉత్కంఠ‌ రేపుతుంది. మ‌సీదు ఇస్లాంలో అంత‌ర్భాగం కాద‌ని న‌మాజ్ ఖ‌చ్చితంగా మ‌సీదులో చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఓపెన్ ఏరియాలో చేసుకోవ‌చ్చు అంటూ 1994లో ఇస్మాయిల్ ఫారుక్ కేసులో సుప్రీమ్ తీర్పును ఇచ్చింది. దీనిపై మ‌ళ్లీ విచార‌ణ జ‌రిపి రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చెయ్యాల‌ని ముస్లిం గ్రూపులు కోరాయి. అయితే ఫారుక్ కేసుతో సంబంధంలేద‌ని స్ప‌ష్టం చేసింది సుప్రీంకోర్టు.   

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.