ఏపీలో కొత్త స‌ర్వే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 16:09:28

ఏపీలో కొత్త స‌ర్వే

ఏపీలో కొత్త స‌ర్వే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇటు వైసీపీ, టీడీపీల‌ను జ‌న‌సేన‌ను క‌ల‌వ‌ర‌బెడుతోంది... ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల ఫలితాలు తారుమారు అయ్యే దిశ‌గా ఆ ఫ‌లితాలు క‌నిపించ‌డంతో వాస్త‌వంగా వైసీపీ దూకుడు పెంచుతోంది.ఇక వైసీపీ తెలుగుదేశం పోటాపోటిగా ప‌లు సెగ్మెంట్లలో హోరా హోరి ఎన్నిక‌ల ఫైట్ కు సిద్దం అని తాజాగా ఓ స‌ర్వే తెలియ‌చేసింది.
 
ముఖ్యంగా క‌ర్నాట‌క‌కు చెందిన ఓ స‌ర్వే సంస్ద ఏపీలో స‌ర్వే నిర్వ‌హించింది... ఇది కృష్ణా,గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో జ‌రిపిన స‌ర్వే.. ఈ స‌ర్వేలో వాస్త‌వాలు చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి ప్ర‌తిప‌క్ష పార్టీకి కాస్త ఆలోచ‌న మ‌దిలో మెదులుతుంది... ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ చాలా బ‌లంగా ఉంది.. ఈ స‌ర్వే కూడా అదే తెలియ‌చేసింది..నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయం అని తేల్చింది ఈ స‌ర్వే సంస్ద‌.
 
ఇక కృష్ణాలో 16 సెగ్మెంట్ల‌లో వైసీపీ 11 సీట్లు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.. అలాగే 5 సీట్లు తెలుదేశం గెలుచుకుంటుంది అని ఇక్క‌డ జ‌న‌సేన ప్ర‌భావం పెద్ద‌గా లేదు అని తేల్చింది ఈ స‌ర్వే..అలాగే గుంటూరు జిల్లాలో17 సెగ్మెంట్ల‌లో  వైసీపీ 13 సీట్లు గెలుచుకుంటుంద‌ని టీడీపీ 3 సీట్లు గెలుచుకుంటుంద‌ని ఒక‌టి జ‌న‌సేన గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని తేల్చింది ఈ స‌ర్వే...
 
ఇటు ప్ర‌కాశం జిల్లాలో 12 సీట్లు ఉండ‌గా ఇక్క‌డ టీడీపీ ఆరు వైసీపీ ఆరుగెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని..  ఈ సారి ఇక్క‌డ ఫిరాయింపుల‌కు స‌రైన ఎదురుదెబ్బ త‌గులుతుంది అని తేల్చింది ఈ స‌ర్వే....మొత్తానికి ఫిరాయింపు సెగ్మెంట్ల‌లో వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన వారికి 45 శాతం ఓట్లు చీలుతాయి అని తెలియ‌చేసింది ఈ స‌ర్వే.. 1000 ప‌ల్స్ తో  ఈ స‌ర్వే చేసిన‌ట్లు తెలుస్తోంది..మొత్తానికి వైసీపీ దూకుడు చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో చ‌రిత్ర సృష్టించే అవ‌కాశం కనిపిస్తోంది అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.