జ‌గ‌న్ పాత్ర‌లో హీరో ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-27 16:21:31

జ‌గ‌న్ పాత్ర‌లో హీరో ఫిక్స్

ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను కొద్ది కాలంగా బ‌యోపిక్ ల హ‌వా ఏ రేంజ్ లొ కొన‌సాగుతుందో మ‌నంద‌రికీ తెలిసిందే... అందులో భాగంగానే  తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నంద‌మూరి తార‌కరామారావు జీవిత క‌థ ఆధారంగా ఆయ‌న త‌న‌యుడు హీరోగా బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తేజ‌ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.
 
ఇక మ‌రో  క‌థ‌తో ల‌క్ష్మీస్ఎ న్టీఆర్ అని అదే జాన‌ర్ లో  విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో సినిమాని తెర‌కెక్కిస్తున్నారు ఇక  ఆనాడు  ఎటువంటి రాజ‌కీయ ప‌రిస్దితులు జ‌రిగాయో తెలిసేలా మ‌రో సినిమా తీయ‌డానికి మ‌రో నిర్మాత రెడీ అవుతున్నారు.
 
ఇక ఏపీలో మాజీ సీఎం దివంగ‌త నేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి  బయోపిక్  కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే... ఈ చిత్రంలో మ‌ల‌యాళ‌ ప్ర‌ముఖ న‌టుడు మ‌మ్ముట్టి వైఎస్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు... ఇక వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాత్ర‌లో సీనియ‌ర్ న‌టి శ‌ర‌ణ్య‌ను చిత్ర యూనిట్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మ‌హి రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.
 
గ‌తంలో  రాఘ‌వ్ కు బ‌దులుగా ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు అని అనుకున్నారు.. మొద‌టి నుంచి వైఎస్ కుటుంబానికి పూరికి అత్యంత స‌న్నిహిత సంబంధం ఉండ‌డంతో ఆయ‌నే ఈ సినిమా తీస్తారు అని అంద‌రూ భావించారు ... కానీ అత‌ని చేతిలో వేరే క‌మ‌ర్షియ‌ల్  ప్రాజెక్ట్ లు ఉండ‌డం వ‌ల్ల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌లేకపోయారు పూరి జ‌గ‌న్నాథ్.
 
దీంతో ఆ ఛాన్స్ మ‌హిరాఘ‌వ్ కు ద‌క్కింది. అయితే ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పుర్తి చేసుకుని త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ను మొద‌లు పెట్ట‌నుంది చిత్ర యూనిట్... రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి !!యాత్ర‌!! అనే టైటిల్ పెట్టారు.
 
ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడు వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి పాత్ర కు కూడా మరో కీలక నటుడిని చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది... వైఎస్సార్ కుమారుడిగా జగన్ పాత్ర సినిమాలో ఎంతో కీలకమో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు... ఈ పాత్ర కోసం తమిళ సూపర్ స్టార్ సూర్యను తీసుకోబోతున్నారని తెలుస్తోంది... సూర్య అయితే జగన్ పాత్రకు స‌రిగ్గా సరిపోతాడని ఫ్యాన్స్ నుంచి, అలాగే  వైఎస్ అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో ఈ  మేరకు చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.