మానుగుంటా దారెటు..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 05:26:58

మానుగుంటా దారెటు..?

ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఆసక్తిక‌రంగా మారాయి.  ఇక్క‌డ గ‌త  ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీచేసి  గెలిచిన పోతుల రామారావు  తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు. ప్ర‌స్తుతం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో కొన‌సాగుతోంది. తుమ్మాటి మాధ‌వరావు కందుకూరు   వైసీపీ  స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగుతున్నారు. 
 
గ‌తంలో కందుకూరు రాజ‌కీయాల్లో  కీల‌క పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ నేత‌, మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి తిరిగి క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కిర‌ణ్ కుమార్ రెడ్డి కాబినేట్ లో పుర‌పాల‌క శాఖ మంత్రిగా ప‌ని చేశారాయ‌న‌.  జ‌గ‌న్ పాద‌యాత్ర నేప‌థ్యంలో మానుగుంట వైసీపీలో చేర‌నున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం కొన‌సాగింది. 
 
అయితే ఫిబ్ర‌వ‌రి 26న కందుకూరులో ప్రారంభించ‌నున్న కార్యాల‌యానికి హాజ‌రుకావాలంటూ అనుచ‌రుల‌కు ఆహ్వానం పంపారు మానుగుంట‌. జ‌గ‌న్ పాద‌యాత్ర కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ముగిసిన త‌ర్వాత మానుగుంట ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన మానుగుంట‌ వైసీపీ నుండి పోటీ చేస్తారా..... టీడీపీ నుండి బ‌రిలో దిగుతారా అనే విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. దీంతో కందుకూరు రాజ‌కీయాల్లో మాగుంట పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై ఇటు టీడీపీలో, అటు వైసీపీలో ఆస‌క్తి నెల‌కొంది. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.