బ్రేకింగ్.. జ‌గన్ కు మ‌ద్ద‌తు తెలిపిన మ‌రో ద‌ర్శుకుడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan prajasankalpa yatra
Updated:  2018-09-26 03:03:10

బ్రేకింగ్.. జ‌గన్ కు మ‌ద్ద‌తు తెలిపిన మ‌రో ద‌ర్శుకుడు

రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతి అరాచ‌కాల‌ను వ్య‌తిరేకిస్తూ ప్ర‌జా పక్షాన నిలుస్తూ ప్ర‌తిష్టాత్మ‌కంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఎర్ర‌ని ఎండా, గాలీ వానను లెక్క చేయకుండా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌డ‌ప‌జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇడుపులపాయ‌లో మొద‌లైన ఈ పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్రలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. 
 
జ‌గ‌న్ ఉత్త‌రాంధ్ర‌లోకి అడుగు పెట్ట‌గానే 3000 వేల కిలో మీట‌ర్ల‌ను పూర్తి చేసుకున్నారు. ఇక 3000 వేల కిలో మీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్టారెడ్డి, నిర్మాత అచ్చి రెడ్డిలు జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు తెలిపారు. జ‌గ‌న్ ను క‌లిసి ఆయ‌న‌తో సుమారు 30 నిమిషాలు పాద‌యాత్ర చేశారు. ఆ త‌ర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ 3000 వేల కిలో మీట‌ర్లు పాద‌యాత్ర చేయ‌డం మామూలు విష‌యం కాద‌ని దానికి శ‌క్తి తోపాటు ప్ర‌జా ధ‌ర‌ణ ఉండాల‌ని అది జ‌గ‌న్ కు పుష్క‌లంగా ఉంద‌ని వారు అంటున్నారు. 
 
వైఎస్ జ‌గ‌న్ 2019లో ముఖ్య‌మంత్రి అయితే ఖ‌చ్చితంగా రాజ‌న్న పరిపాల‌న రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌ళ్లీ చూస్తార‌ని  అచ్చి రెడ్డి అన్నారు. కాగా ఇప్ప‌టికే 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీరాజ్ అలాగే ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళి జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.