ఏవండోయ్ ఇది విన్నారా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-29 18:46:45

ఏవండోయ్ ఇది విన్నారా

ఏపీలో ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం తీవ్ర రూపం దాల్చిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇందులో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా త‌మ ప్ర‌తాపం చూపుతున్నారు... ఎక్క‌డిక‌క్క‌డ బీజేపీ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు..అయితే ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించ‌లేదంటూ కేంద్రం పై అనేక విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి అన్ని రాజ‌కీయ పార్టీలు. రాష్ట్రంలో ఉన్న‌టువంటి అధికార తెలుగుదేశం, ప్ర‌తిప‌క్ష వైయ‌స్ కాంగ్రెస్ పార్టీ ఒక‌రి పై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న విష‌యం అంద‌రికి తెలిసిందే.
 
తాజాగా టీడీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించినట్లు ఒక్క క్లిప్పింగ్ చూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్ ప్రధానమంత్రి మోదీ కనుసన్నల్లో నడుస్తున్నారని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
 
అయ్యా ఎస్వీ మోహన్‌రెడ్డి గారు ప్ర‌త్యేక‌హోదా కోసం గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా వైయ‌స్ జ‌గ‌న్‌ నిర్విరామంగా పోరాటం చేస్తున్న విష‌యం మీకు తెలియ‌దా. రాష్ట్ర‌వ్యాప్తంగా యువ భేరిలు, దీక్ష‌లు, క‌లెక్ట‌రేట్ ముట్ట‌డులు, రాస్తారోకోలు, చేసిన విష‌యం మీకు తెలియ‌దా మీరు పార్టీ ఫిరాయించ‌కముందు యువ‌భేరీలు జ‌ర‌గ‌డం ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలియ‌దా..? అస‌లు మీరు చెప్పేదానికి స‌మ‌ర్దన ఎలా ఉంటుంది..
 
ప్ర‌భుత్వం పై అవిశ్వాసం పెడ‌తామ‌ని ప్రాంతీయ పార్టీ చెప్పినప్పుడు దేశంలో ఉన్న 1000 పార్టీలు ఫోక‌స్ చేస్తాయి.. అది వైసీపీని చేశాయి.. అవేమీ మీకు ప‌ట్ట‌వు ....రాత్రికి రాత్రి మీడియా ముఖంగా ప్యాకేజీకి ఒప్పుకుని వైసీపీ అవిశ్వాసం పెడితే జ‌గ‌న్ ఆ యుద్దంలో విజ‌యుడు అవుతాడు అని డైవ‌ర్ష‌న్ చేసి యూట‌ర్న్ తీసుకున్న మీ ఫిరాయింపు పార్టీ,  జ‌గ‌న్ పోరాటం పై విమ‌ర్శ‌లు ఆపాలి..... నిజాయితీగా రాజీనామా చేసి ప్ర‌త్యేక హూదా కోసం చేశా అని ఎన్నిక‌ల్లో నిల‌బ‌డండి అని వైసీపీ రివ‌ర్స్ కౌంట‌ర్ ఇస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.