ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ ఎమ్మెల్యే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-08 12:52:43

ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ ఎమ్మెల్యే

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. త‌మ‌కు టీడీపీ అదిష్టానం టికెట్ ఇస్తుందో లేదో అన్న అనుమాలు రోజు రోజుకు త‌లెత్తుతున్నాయి. ఇక మ‌రికొంద‌రు అయితే  చేసేది ఏం లేక జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారనే వార్త‌లు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. 
 
ఎప్ప‌టి నుంచో టీడీపీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కుల ప‌రిస్థితే ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం అధికార టీడీపీ నాయ‌కులు ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకేలా ఉందో అంతు చిక్క‌డం లేదు. 2014ఎన్నిక‌ల్లో రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే ఇష్టాను సారంగా తిట్టి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మార్కుల‌ను కొట్టేయ్యాల‌ని చూశారు. అయితే చంద్ర‌బాబు వారి మాట‌ల‌ను వీక్షించారు త‌ప్ప వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌లేదు.
 
ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేపథ్యంలో ఫిరాయింపుల‌కు సీటు ఇస్తారో లేదో అన్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారట‌. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలంద‌రూ తెర ముందు బాగానే క‌వ‌ర్ చేస్తున్నా తెర వెనుక మాత్రం త‌మ‌కు సీటు కేటాయించ‌ర‌నే అనుమానాల‌తో ఉన్నారు.
 
ఇక 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో 22 మందిని ప‌క్క‌న పెడితే మిగిలిన ఆ ఒక్క‌రి ప‌రిస్థితి మాత్రం ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితి త‌లెత్తుతోంది. ఇంత‌కు ఆ ఓక్క‌రు ఎవ‌ర‌నేగా మీ ప్ర‌శ్న.... ఆ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు క‌ర్నూల్ జిల్లా ఆర్భ‌న్ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్ననేప‌థ్యంలో ఎస్వీ టికెట్ చాలా క్రిటిక‌ల్ గా మారుతోంది. 
 
ఎందుకంటే ఆయ‌న‌ను ఏ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌నే అలోచ‌న‌లో ప‌డింది టీడీపీ అధిష్టానం. మొద‌ట్లో ఎస్వీని క‌ర్నూల్ జిల్లా నుంచే పోటీ చేయించాల‌ని చూసింది అదిష్టానం. కానీ అక్క‌డ టీజీ వెంక‌టేష్ కుమారుడు టీజీ భ‌ర‌త్ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌ర్నూల్ నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అందుకోసం ఇప్ప‌టినుంచే ఆయ‌న పేరిట క‌ర్నూల్ లో అసోసియేష‌న్ త‌యారు చేసుకుని సామాజికి కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. దీంతో ఇక్క‌డ ఎస్వీకి నూటికి నూరు శాతం సీటు క‌న్ఫామ్ కాన‌ట్లే.
 
ఇక చివ‌రి అస్త్రం ప‌త్తికొండ నియోజ‌క వ‌ర్గం, ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహ‌న్ రెడ్డిని పోటీ చేయించాల‌ని టీడీపీ అదిష్టానం ఆలోచించింది. అయితే ప్ర‌స్తుతం ఈ సెగ్మెంట్ లో కేఈ కృష్ణ మూర్తి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అయితే ఆయ‌కు వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసే వ‌య‌సు లేక‌పోవ‌డంతో ఎస్వీని అక్క‌డ నుంచి పోటీకి దించాల‌ని చూశారు.
 
అయితే ఇక్క‌డ కూడా ఎస్వీకి ఎదురు దెబ్బ‌త‌గిలే ప‌రిస్థితి తలెత్తుతోంది. ఈ నియోజ‌కవ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీ త‌ర‌పున కేఈ కృష్ణ మూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇందుకోసం ఆయ‌న నిత్యం ప్ర‌జా సేవ చేస్తూ ప్ర‌జ‌ల్లో నిమ‌గ్న‌మైయ్యారు.
 
ఇక ఇప్ప‌టికే టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్ర‌భాక‌ర్ కూడా మినీ మ‌హానాడు స‌భ‌లో భ‌హిరంగాంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌త్తికొండ నియోజ‌కవ‌ర్గం నుంచి కేఈ శ్యాంబాబు మాత్ర‌మే పోటీ చేస్తార‌ని ఇంకెవ్వ‌రు పోటీ చేయ‌ర‌ని స‌భా ముఖంగా చెప్పారు. ఇక ప‌త్తికొండ‌లో కూడా  ఎస్వీకి సీటు క‌న్ఫామ్ కాన‌ట్లే. ఇక మిగిలి అన్ని నియోజ‌కవ‌ర్గాల్లో అభ్య‌ర్థులు ఉన్నారు.
 
సో... ఇప్పుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి ప్ర‌యాణం ఎటు వైపు అనేది పెద్ద చ‌ర్చ‌గా మారుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీలో కొన‌సాగితే పోటీ చేయ‌లేని ప‌రిస్థితి. ఇక తిరిగి సొంత గూడు అయిన వైసీపీలో చేరాల‌నుకుంటే ఎట్టి పరిస్థితిలో జ‌గ‌న్ ఆహ్వానం ఉండ‌దు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఏ నిర్ణ‌యం తీసుకుంటారనేది ఆస‌క్తిగా మార‌నుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.