జ‌గ‌న్ పై స్వ‌రూపానందేంద్ర కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-17 01:12:14

జ‌గ‌న్ పై స్వ‌రూపానందేంద్ర కీల‌క వ్యాఖ్య‌లు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హిందూ వ్య‌తిరేకి అంటూ జ‌గ‌న్ పై చేసిన ప్ర‌చారంతో పాటు ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌పై స్వ‌రూప‌నందేంద్ర స్పందించారు. 
 
గ‌తంలో మీడియా చేసిన అస‌త్య ప్ర‌చారం కార‌ణంగా వైయ‌స్ జ‌గ‌న్ హిందూ వ్య‌తిరేకి అని భావించాన‌ని ఆయ‌న అన్నారు. కానీ 2014 ఎన్నికల తర్వాత తొలిసారి జగన్ తన వద్దకు వచ్చినప్పుడు అసలు విషయం అర్థమైందని,  జగన్‌పై టీవీ చానళ్లు ఏ స్థాయిలో అసత్య ప్రచారం చేశాయో అప్పుడు త‌న‌కు తెలిసింద‌ని  చెప్పారు.
 
జగన్‌లో హిందూవ్యతిరేక లక్షణాలు తనకు క‌నిపించ‌లేద‌ని, జగన్‌ ధర్మం తెలిసివాడని తాను నిర్ధారించుకున్నాన‌ని అన్నారు. జ‌గ‌న్ అస‌త్యాలు మాట్లాడి ఉంటే 2014 లోనే ముఖ్య‌మంత్రి అయ్యేవాడ‌ని  స్వ‌రూపానందేంద్ర అభిప్రాయ‌ప‌డ్డారు.. సీఎం అయితే గ్రామాల్లోని దేవాలయాలన్నింటిని పునరుద్దరించి ఆ గ్రామంలోని అర్చకుల ఆధ్వర్యంలోనే నడిచేలా చేస్తానని జ‌గ‌న్ చెప్ప‌డం త‌న‌కు బాగా న‌చ్చింద‌ని అన్నారు.
 
జ‌గ‌న్ లో మొండి త‌నం ఉంది కావున పాద‌యాత్ర‌తో పాటు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేయ‌గలుగుతున్నార‌ని, ఒక‌వేళ భవిష్య‌త్తులో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక త‌ప్పులు చేస్తే ప్ర‌శ్నించే వారిలో ముందు తానే ఉంటాన‌ని చెప్పిన స్వ‌రూపానందేంద్ర, చంద్ర‌బాబు పాల‌న వైఫ‌ల్యాన్ని తీవ్ర స్ధాయిలో విమ‌ర్శించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.