జ‌గ‌న్ పై టి. సుబ్బరామిరెడ్డి సంచ‌లన వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 12:52:31

జ‌గ‌న్ పై టి. సుబ్బరామిరెడ్డి సంచ‌లన వ్యాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ పెట్టిన మొద‌ట్లో ఎన్టీఆర్ టి సుబ్బ‌రామిరెడ్డిని రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆహ్వానించారు... ప్రాంతీయ రాజ‌కీయాలు ఇష్టం లేక‌,  ఆయ‌న జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆస‌క్తితో, 1989 లో రాజీవ్ స‌మ‌యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీలోకి  చేరారు. టీటీడీ చైర్మ‌న్ గా చేసి జాతియ స్ధాయిలో కూడా, ఎంపీగా చేసి పేరు తెచ్చుకున్నారు.. ఆయ‌న‌ రాజ‌కీయంగా  అంచెలంచెలుగా ఎదిగా  సినీ నిర్మాత‌గా కూడా మారారు.
 
తాజాగా ఆయ‌న ఏపీ రాజ‌కీయాల పై చ‌ర్చించారు.. నిత్యం ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న వైయ‌స్ జ‌గ‌న్ ను  ఆయ‌న స‌పోర్ట్ చేశారు. ఆయ‌న విధానం బాగుంది అని, అస‌లు అలా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ కు లేదు, కాని జ‌గ‌న్ రాజ‌కీయంగా బాగా ప‌రిణితి చెందారు. ఏసీ హాల్లో కూర్చొని న‌లుగురితో మాట్లాడి రాజ‌కీయాలు చేసే ఈ రోజుల్లో, జ‌గ‌న్ ఇలా ఆరు నెల‌ల పాటు ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జాయాత్ర‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉండ‌టం చాలా గొప్ప విష‌యం అని ఆయ‌న అన్నారు.
 
దివంగ‌త సీఎం రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌స్తిన వ‌స్తే క‌చ్చితంగా త‌న ఇంటికి వ‌చ్చి భోజ‌నం చేసేవార‌ని, సెంట్ర‌ల్ లో ఉన్న‌తాధికారుల‌తో అక్క‌డ భేటీ అయ్యేవార‌ని ఏపీకి సాయం చేయాలి అని కోరేవాడిని అని టి. సుబ్బ‌రామిరెడ్డి అన్నారు. జ‌గ‌న్ చ‌రిష్మా ఉన్న నాయ‌కుడు ఏదైనా సాధించ‌గ‌ల‌డు అన్నారు ఆయ‌న‌... ఇక ఏపీకి  ప్ర‌త్యేక హూదా పై స్టాండ్ తీసుకోవ‌డం జ‌గ‌న్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు మ‌రింత న‌మ్మ‌కం పెరుగుతోంది అని ఆయ‌న విశ్వాసం తెలియ‌చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.