విజ‌య‌సాయిరెడ్డికి టి సుబ్బ‌రామిరెడ్డి స‌పోర్ట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

subbaramireddy vijayasaireddy image
Updated:  2018-03-28 11:13:53

విజ‌య‌సాయిరెడ్డికి టి సుబ్బ‌రామిరెడ్డి స‌పోర్ట్ ?

తెలుగుదేశం పార్టీ... వైసీపీ రాజ్య‌స‌భ మెంబ‌ర్  విజ‌య‌సాయిరెడ్డి పై ఫోక‌స్ చేస్తోంది అనేది తెలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా తెలుగుదేశం నాయ‌కులు విజ‌య‌సాయిరెడ్డిపై అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్నారు... ముఖ్యంగా ఏ2 అని, ప‌లు కేసుల్లో ఆయ‌న నిందితుడు అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పై అనేక విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అయితే తెలుగుదేశం చేస్తున్న రాజ‌కీయాల పై వైసీపీ నిరంత‌రం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటుంది.. ఇక నిన్న రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన గంద‌ర‌గోళం పై రాత్రి ఆస్ధాన‌మీడియాల్లో కూడా విజ‌యసాయిరెడ్డి ఏపీ ప‌రువు తీశారు అని అనేక కామెంట్లు చ‌ర్చ‌ల‌కు తీసుకువ‌చ్చాయి, ప‌లు డిబేట్లు కండెక్ట్ చేశాయి.
 
విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కాళ్ల‌కు న‌మ‌స్కారం చేశారు అని అనేక క‌థ‌నాలు వండివార్చాయి ఆస్దాన‌మీడియాలు... అయితే తెలుగుదేశం చేస్తున్న ప్ర‌చారాన్ని ఈ నింధ‌లు వేసిన సెకండ్ ట‌ర్మ్ రాజ్య‌స‌భ ఎంపీ అవ‌కాశం పొందిన సీఎం ర‌మేష్ కు విజ‌యసాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు... రాజ్య‌స‌భ పుటేజ్ బ‌య‌ట‌పెట్టాల‌ని తాను ప్ర‌ధాని కాళ్లు మొక్క‌లేద‌ని, ఆయ‌న కాళ్లు మొక్కాము అని మీరు చెబుతున్న వీడియోలు సాక్ష్యాదారాలు బ‌య‌ట‌పెట్టాలని ఆయ‌న స‌వాల్ చేశారు.. ఇక సారాయి వ్యాపారం చేసే సీఎం ర‌మేష్ త‌న పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏమిట‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
సాయంత్రానికి సాక్ష్యాదారాలు బ‌య‌ట‌పెడ‌తా అన్న సీఎం ర‌మేష్ ఇప్పుడు ఆ సాక్ష్యాదారాలు బ‌య‌ట‌పెట్ట‌లేక‌పోతున్నారు.. ఇక  ఈ ప్ర‌చారం పై కాంగ్రెస్  పార్టీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి మండిప‌డ్డారు. సభలో ప్రధానమంత్రికి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేయకపోయినా చేసినట్లు తప్పుడు ప్రచారం సాగించడం సరైంది కాదు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు నమస్కారం పెట్టడం మామూలే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేను కూడా మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీకి నమస్కరించా. 
 
పెద్దలకు నమస్కారం చేయడం మన భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో భాగం. దీనిని తెలుగుదేశం ఇంత‌లా ప్ర‌చారం చేయ‌డం ఏమిట‌ని ఆయ‌న మండిప‌డ్డారు ఇలాంటి ప‌నులు చేసి తెలుగువారి  ప‌రువును బ‌జారున పెట్టకండి అని ఆయ‌న సూచించారు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.