త‌ల‌సాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-24 17:52:07

త‌ల‌సాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీకి ఎవ‌రు అయితే ప్ర‌త్యేక హూదా ఇస్తారో వారికే  మా మ‌ద్ద‌తు అని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలియ‌చేశారు.. అయితే ఇటు నాలుగు సంవ‌త్స‌రాలుగా పార్టీలో ఉంటూ, నాయ‌కుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఎన్డీయేలో కొన‌సాగిన తెలుగుదేశం పై విమ‌ర్శ‌లు మ‌రింత పెరుగుతున్నాయి.. అయితే ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో బీజేపికి మైలేజ్ పెరిగింది కాని తెలుగుదేశం మాత్రం అలా ఢీలా ప‌డుతూనే ఉంది.. ప్ర‌జ‌ల‌కు కూడా తెలుగుదేశం పై కాస్త న‌మ్మ‌కం కూడా స‌న్న‌గిల్లింది... ఇన్ని సంవ‌త్స‌రాలు ఎందుకు ఇంత మౌనం వ‌హించారు అని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.
 
ఇటు ప్ర‌త్యేక హూదా కోసం రాజకీయాలు చేస్తున్నారు అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. రాజ‌కీయ పార్టీలు తీసుకునే నిర్ణ‌యాలు ప్ర‌జాభీష్ఠంగా ఉండ‌టం లేదు అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి... ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ పై విమ‌ర్శ‌లు  చేసిన సంగ‌తి తెలిసిందే... ఆయ‌న థ‌ర్డ్ ఫ్రంట్ పెట్టే యోచ‌న‌లో ఉన్నారు, ఇప్ప‌టికే మంత‌నాలు అన్ని జ‌రిపారు. అయితే రాజ‌కీయంగా ఇది మ‌రింత హీట్ పుట్టిస్తోంది... అక్క‌డ మ‌మ‌త నుంచి రాజ‌కీయంగా పావులు క‌దుపుతున్నారు అయితే తెలంగాణ‌లో మ‌రింత పొలిటిక‌ల్ మైలేజ్ కేసీఆర్ కు వస్తుంది అన‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తిలేదు.
 
ఓటుకు నోటుకేసులో ఇటు తెలుగుదేశం అటు టీఆర్ ఎస్ సర్కారుల మ‌ధ్య ఎటువంటి పొలిటిక‌ల్ వార్ జ‌రిగిందో తెలిసిందే... అయితే కొద్ది నెల‌ల క్రితం ఈ వార్ త‌గ్గింది, ఇరు స‌ర్కారులు ఈ విషయాన్ని ప‌క్క‌న పెట్టాయి.. విచార‌ణ కూడా ప‌క్క‌కు జ‌రిగింది. ఇక ఏపీకి కేంద్రం ఎటువంటి సాయం చేయ‌క‌పోవ‌డం ప్ర‌త్యేక హూదా పై మాట మార్చ‌డం తో కేసీఆర్ కూడా  గ‌తంలో మాట్లాడారు..
 
ప్ర‌ధాని హామీ ఇస్తే క‌చ్చితంగా తీర్చాల్సిందే అని అన్నారు. అయితే దీనిపై తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు...ఏపీలో టీడీపీ సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంటోంది. చంద్రబాబు ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాత.. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రయోజనం లేదు. కలిసి ఉన్నప్పుడు ప్రశ్నించి ఉంటే ఉపయోగం ఉంటుంది అని అన్నారు.
 
నిన్నటి వరకు టీడీపీ - బీజేపీ కలిసే ఉ‍న్నాయి. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ఎందుకు లేవనెత్తలేదు?.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని కలిస్తే చంద్రబాబు ఎందుకు?.. ఏపీ ప్రజల ఆవేదన చూసి నేను మాట్లాడాల్సి వస్తోంది అని తలసాని వ్యాఖ్యానించారు. మొత్తానికి అక్క‌డ తెలంగాణ లో పార్టీ ఫిరాయింపుల‌పై అనేక కామెంట్లు చేశారు చంద్ర‌బాబు, ఏపీలో అదే రామాయ‌ణం ఫాలో అయ్యారు.. దీంతో త‌ల‌సాని స‌హా తెలుగుదేశం నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంద‌రూ ఇదే కామెంట్లు చేస్తున్నారు బాబు పై. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.