క‌నీసం 30 వేల ఓట్ల‌తో టీడీపీని ఓడిస్తాం ఆ పార్టీనేత‌లు బాబుకు హెచ్చ‌రిక‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu naidu
Updated:  2018-09-22 12:07:16

క‌నీసం 30 వేల ఓట్ల‌తో టీడీపీని ఓడిస్తాం ఆ పార్టీనేత‌లు బాబుకు హెచ్చ‌రిక‌లు

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల్లో వ‌ర్గ‌విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒక స‌మ‌స్య పూర్తి కాగానే మ‌రో స‌మ‌స్య పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీంతో అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా తాడిపత్రిలో జేసీ అనుచ‌రుల‌కు, ప్ర‌బోధానంద‌స్వామి వ‌ర్గీయుల‌కు మ‌ధ్య వివాదాలు చ‌ల్లార‌క‌ ముందే మరోవివాదం తెర‌పైకి వ‌చ్చింది. 
 
విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే మృణాళినికి ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ నాయ‌కులు ప‌చ్చ‌గ‌డ్డివేస్తే భ‌గ్గుమ‌న్నంత వైర్యం వీరి మ‌ధ్య న‌డుస్తుంది. ఇక ఈ వ్య‌వ‌హారం చివ‌ర‌కు చంద్ర‌బాబు నాయుడు స‌చివాలయానికి చేరుకుంది. కొద్దిరోజుల క్రితం చీపురుప‌ల్లి, గ‌రివిడి మెర‌క‌ముడిదాం మండ‌లాల‌కు చెందిన టీడీపీ స‌ర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఏక‌మై చంద్ర‌బాబు కు ఫిర్యాదు చేశారు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో మృణాళినికి టీడీపీ త‌ర‌పున టికెట్ ఇస్తే తాము స‌పోర్ట్ చెయ్య‌మ‌ని తెగేసి చెప్పారు. ఒకవేళ‌ అధిష్టానం పోటీ చేయిస్తే ఖ‌చ్చితంత‌గా ఆమెను సుమారు 30 వేల ఓట్ల తేడాతో ఓడిస్తామని చంద్ర‌బాబుకు వారు హెచ్చ‌రించారు. అంతేకాదు మృణాళిని భ‌ర్త గ‌జ‌ప‌తిరాపుపై కూడా వారు ఫిర్యాదు చేశారు. తామంత పార్టీలో ప‌ని చెయ్య‌ల‌న్నా, టీడీపీలో బ్ర‌త‌కాల‌న్నా మృణాళినికి టికెట్ కేటాయించ‌కూడ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ఇక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రు మూకుమ్మ‌డిగా వ‌చ్చి ఎమ్మెల్యేను ఓడిస్తామ‌ని చెప్ప‌డంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశ్చ‌ర్యానికి గురి అయ్యారు. మ‌రి కొన్నిరోజుల్లో ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికేలా చేస్తాన‌ని చెప్ప‌డంతో వారంద‌రూ కాస్త చ‌ల్ల‌బ‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.