జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నంలో అడ్డంగా దొరికిన టీడీపీ, పోలీస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-10-27 04:41:12

జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నంలో అడ్డంగా దొరికిన టీడీపీ, పోలీస్

అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలోకి ఎవ‌రైనా అడుగు పెట్టాలంటే అనేక ఆంక్ష‌లు, నిబంధ‌న‌లు ఉంటాయి. త‌నిఖీల విష‌యంలో ప్ర‌యాణికులనే కాదు అక్క‌డ ప‌నిచేసే సిబ్బందిని కూడా అనువ‌ణువునా త‌నిఖీ చేస్తారు ఎయిర్ పోర్టు అధికారులు. అంతేకాదు అక్క‌డ ప‌నిచేసే సిబ్బందికి పాస్ లు జారీ చేసే విష‌యంలోను అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.
 
అయితే తాజాగా ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత హ‌త్యాయ‌త్నంలో నిందితుడు శ్రీనివాస‌రావుకు పాస్ జారీ విష‌యంలో రాష్ట్ర పోలీసుల వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వాస్తవానికి ఎయిర్ పోర్ట్ లోని రెస్టారెంట్ తో పాటు ఇత‌ర విభాగాల్లో ప‌నిచేసే సిబ్బందికి ప్ర‌త్యేకంగా డ్యూటీ పాస్ ల‌ను ముందుగానే అధికార‌లు జారీ చేస్తారు. రెస్టారెంట్ లో ప‌నిచేసే సిబ్బంది అయితే దాని య‌జ‌మాని త‌మ వ‌ద్ద ఎవ‌రెవ‌రు ప‌నిచేస్తున్నారు వారిని ఏవిధంగా నియ‌మించుకున్నామొ వివ‌రిస్తూ ఎయిర్ పోర్టు అధికారుల‌కు లేఖ ఇవ్వాలి. 
 
లేఖ ఇచ్చిన త‌ర్వాత వారిపై ఏమైనా కేసులు ఉన్నాయో లేదో విచారించి రిపోర్టు ఇవ్వాల‌ని స్థానిక పోలీస్ అధికారుల‌కు ఎయిర్ పోర్టు అధికారులు లేఖ రాస్తారు. ఒక వేళ వారు స్థానికులు అయితే వారు నివ‌సిస్తున్న ప్రాంతాల ప‌రిధిలోని పోలీస్ స్టేష‌న్ లో విచారించి క్లియ‌రెన్స్ స‌ర్టిఫికెట్ పంపిస్తారు. ఇక వేరే జిల్లాల‌కు చెందిన వారు అయితే ఆయా జిల్లాల‌కు వారి వివ‌రాల‌ను పంపి అక్క‌డ ఎస్పీల ద్వారా ఎన్వోసీలు తెప్పించుకుంటారు. 
 
ఎలాంటి కేసులు లేవ‌ని సంబంధిత పోలీస్ స్టేష‌న్ లో తేలితేనే ఎన్వోసీలును జారీ చేస్తారు. ఒక వేళ కేసులు ఉంటే వాటి తీవ్ర‌త సెక్షన్లు, ఏ సంద‌ర్భంలో ఆ కేసు న‌మోదు అయ్యాయే వివ‌రిస్తూ రిపోర్ట్ పంపిస్తారు. కేసులు ఉన్నాయ‌ని స్ప‌ష్టంగా  రిపోర్ట్ లో పేర్కొంటే మాత్రం ఎయిపోర్టు అధికారులు వాటిని తిర‌స్క‌రిస్తారు.

షేర్ :

Comments

0 Comment