ఢిల్లీ సాక్షిగా అడ్డంగా దొరికిన‌ టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-18 18:04:06

ఢిల్లీ సాక్షిగా అడ్డంగా దొరికిన‌ టీడీపీ

దేశ ప్రజ‌లు దేవాల‌యంగా భావించే పార్ల‌మెంట్ సాక్షిగా, అధికార తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ర‌హ‌స్య ఒప్పందం గుట్టు ర‌ట్టు అయింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బా బునాయుడు టీడీపీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి త‌మ పార్టీకి ప్ర‌ధాన శ‌త్రువు కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోనే కాదు దేశ రాజ‌ధాని అయిన‌టు వంటి ఢిల్లీలో కూడా అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే పార్ల‌మెంట్ సాక్షిగా వారు ఎంద‌త‌మేర‌కు బ‌ద్ద శ్ర‌తువులో ఈ రోజు తెలిసిపోయింద‌ని జ‌నాలు అంటున్నారు. 
 
వర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల తొలిరోజున అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే వారి అవిశ్వాసానికి మ‌ద్ద‌తు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేలు లేచి నిల‌బ‌డ్డారు. దీంతో లోక్ స‌భా స్పీక‌ర్ సుమిత్ర మ‌హజ‌న్ వారు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలుపుతున్న‌ట్లు పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌క‌టించారు. 
 
గ‌డిచిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌తిక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  చెందిన ఐదుగురు ఎంపీలు ఏపీకి అన్యాయం జ‌రుగుతుంద‌ని పార్ల‌మెంట్ లో త‌మ ఘ‌ళాన్నివిప్పి సుమారు 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెడితే వాటిని స్పీక‌ర్ ఎక్క‌డ ఆమోదిస్తారో అన్న‌ భ‌యంతో అధికార తెలుగుదేశం పార్టీ కి చెందిన ఎంపీలు స‌భ‌ మొద‌లు కాగానే స్పీక‌ర్ పోడియం వ‌ద్ద నిర‌స‌లు తెలిపి స‌భ‌ను వాయిదా వేయించారు. ఇక వీటితో పాటు స్పీక‌ర్ త‌మిళ‌నాడు కావేరి విష‌యాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చారు. దీంతో త‌మిళనాడు ఎంపీల ఆందోళ‌న సాకుతో వైసీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసుల‌ను చ‌ర్చ‌కు రాకుండా చేశారు. దీంతో స‌భ స‌క్ర‌మంగా జ‌రగ‌డం లేద‌ని స‌భ‌ను స్పీక‌ర్ ప్ర‌తీ రోజు వాయిదా వేస్తూనే వ‌చ్చారు. 
 
ఇక ఈరోజు జ‌రిగిన స‌మావేశంలో మొద‌టిరోజే టీడీపీ ఎంపీల అవిశ్వాసాన్ని ఆమోదిస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించ‌డంతో టీడీపీ, బీజేపీ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుంద‌ని వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు బ‌ద్ద శ‌త్రువులు కూడా ఒక్క‌ట‌య్యార‌నే చెప్పాలి.

షేర్ :

Comments

1 Comment

  1. Mundagallaku manchi kanipinchadu.chandrababunu nakane saripoye nakodakalaku.Avineethi nakodukullara.meerantha kalasi Chandra Babu ventruka kuda peekaleru

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.