జేసీ బ్ర‌ద‌ర్స్ వ‌ల్ల‌ మాకు ప్రాణ‌హాని ర‌క్షించండి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 14:46:43

జేసీ బ్ర‌ద‌ర్స్ వ‌ల్ల‌ మాకు ప్రాణ‌హాని ర‌క్షించండి

రాజ‌కీయాలకు ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి జేసీ దివాక‌ర్ రెడ్డి ఇటు రాజ‌కీయంలో అయినా అటు వ్య‌క్తిగ‌త విష‌యాల్లో అయినా ముక్కుసూటిగా మాట్లాడుతారు. తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రుగ‌క ముందు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. గ‌తంలో కాంగ్రెస్ లో ఉంటూ అనంత‌లో పేరు మోసిన అనంత‌వెంక‌ట‌రామి రెడ్డిని, ర‌ఘువీరా రెడ్డితో విభేదాలు పెట్టుకుని వ్య‌వ‌హ‌రించారు జేసీ.  
 
ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీ లో కాంగ్రెస్ పార్టీ నామ‌రూపం లేకుండాపోవ‌డంతో జేసీ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడి స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఎవ‌రి స‌మ‌క్షంలో అయితే టీడీపీ తీర్థం తీసుకున్నారో ఆయ‌ననే గ‌తంలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి అని చూడ‌కుండా స‌భా ముఖంగా చంద్ర‌బాబు నాయుడుని దుమ్ముదులిపిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.
 
ఇక 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో జేసీ దివాక‌ర్ రెడ్డి అనంత‌పురం టీడీపీ నాయ‌కుల‌పై త‌న విశ్వ‌రూపం ప్ర‌యోగిస్తున్నారు. ఇప్ప‌టికే టీడీపీకి చెందిన ఎనిమిదిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జేసీ ఫ్యామిలీపై గుర్రుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో మ‌రికొంద‌రు టీడీపీ అస‌మ్మ‌తి నేత‌లు జేసీపై భ‌గ్గుమంటున్నారు. అధికార బ‌లంతో జేసీ బ్ర‌ద‌ర్స్ తాడిప‌త్రిలో రెండు వంద‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని ఇదే విష‌యాన్ని తాము ఎక్క‌డైనా ఎప్పుడైనా నిరూపించేందుకు సిద్ద‌మ‌ని టీడీపీ అస‌మ్మ‌తి నేత‌లు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, అలాగే జ‌య‌చంద్రారెడ్డి ఆరోపించారు. 
 
2014 నుంచి తాడిప‌త్రిలో జేసీ అరాచ‌కం ఏలుతోంద‌ని, దౌర్జ‌న్యాలు అక్ర‌మాలు జ‌రుగుతున్నా కూడా  ప‌ట్టించుకునే అధికారులు లేర‌ని వారు వాపోయారు. అలాగే త‌మ‌కు జేసీ బ్ర‌ద‌ర్స్ నుంచి ప్రాణహాని ఉంద‌ని, త‌మ‌కు వెంట‌నే ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, జ‌య‌చంద్రా రెడ్డి ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఆనాటి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి లేఖ కూడా రాశామ‌ని వారు స్ప‌ష్టం చేశారు. తాడిప‌త్రి మున్సిప‌ల్ ఆఫీస్ ను జేసీ ఫైనాన్స్ ఆఫీస్ గా మార్చుకున్నార‌ని అందులో పనిచేసే ఉద్యోగ‌స్తులంద‌రూ జేసీ బినామిలే అని మండిప‌డ్డారు. ఇందుకు సంబంధించిన త‌గిన సాక్ష్యాలు త‌మ‌ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.