జ‌గ‌న్ నిర్ణ‌యంతో టీడీపీ వెన‌క‌డుగు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan decision
Updated:  2018-04-02 11:31:16

జ‌గ‌న్ నిర్ణ‌యంతో టీడీపీ వెన‌క‌డుగు ?

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం రాజ‌కీయంగా కాక‌పుట్టిస్తోంది ఏపీలో... తెలుగుదేశం కేంద్రం పై విమ‌ర్శ‌లు చేయ‌డం, ఆ వెంట‌నే అసెంబ్లీలో ఏకంగా స‌మావేశాల రోజులు పెంచి, కేంద్రం పై విసుర్లు విస‌ర‌డం తాము ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం అని చెప్ప‌డం...దేశంలో తాను సీనియ‌ర్ అని సీఎం చంద్ర‌బాబు చెప్ప‌డం, ఆ వెంట‌నే ఎమ్మెల్యేలు బ‌ల్ల‌లు చ‌ర‌చ‌డం ఇదే విధానం వారాల కొద్ది నడుస్తూ ఉంటోంది... అయితే తెలుగుదేశం మాత్రం అదే ఫార్మూలా పాటిస్తోంది... ఓ ప‌క్క ప్ర‌తిప‌క్షం లేదు, ఉన్నా బీజేపీ ప‌క్షం కూడా నలుగురు స‌భ్యులు ఉండ‌టం వారు కూడా ప్ర‌ధాని మోదీ ని స‌మ‌ర్దించ‌డంతో, అస‌లు అసెంబ్లీ స‌మావేశాల లేక తెలుగుదేశం మ‌హానాడు కార్య‌క్ర‌మాలా అన్న చందంగా ఉన్నాయి ఆ స‌భ‌లు స‌మావేశాలు.
 
ఇక జ‌గ‌న్ తీసుకున్నఎంపీల ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష నిర్ణ‌యం రాజ‌కీయంగా కాక‌పుట్టిస్తుంటే, ఇటు జ‌గ‌న్ నిర్ణ‌యంతో తెలుగుదేశం ఔరా ఏమీ  జ‌గ‌న్ తెలివి అని అనుకుంటున్నారు.. జంత‌ర్ మంత‌ర్ అంటే అంద‌రూ రిలేదీక్ష‌లు నిరాహార‌దీక్ష‌లు చేసే స్ధ‌లం..ఇక్క‌డ ఎవ‌రు ఎటువంటి నిరాహార‌దీక్ష‌లు చేసినా గంట‌ల స‌మ‌యంలోనే పోలీసులు రావ‌డం అరెస్టులు చేయ‌డం జ‌రుగుతుంది.. ఇక పార్ల‌మెంట్ స‌మావేశాల ముందు రోజు కూడా ఇక్క‌డ వైసీపీ ప్ర‌త్యేక హూదా కోసం దీక్ష చేప‌ట్టింది... మ‌ధ్యాహ్నానికి పోలీసులు దీక్ష భ‌గ్నం చేశారు.
 
అయితే ఇప్పుడు జ‌గ‌న్ దీనికి రివ‌ర్స్ గా ఏపీ భ‌వ‌న్ లో త‌మ ఎంపీలు లోక్ స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డ‌గానే ,ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేస్తారు అని తెలియ‌చేశారు.. దీంతో తెలుగుదేశం నీర‌సించిపోయింది ...బాబు ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి.. పరిస్దితి ఇలా ఉంది అని ఆలోచ‌న‌లో ప‌డిపోయింది... మ‌న ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేస్తే పోలీసులు ఎలా ఎంట‌ర్ అవుతారు ... ఇలాంటి నిర్ణ‌యం జ‌గ‌న్ తీసుకుంటే టీడీపీ ఊహ‌కు కూడా ఈ ఆలోచ‌న రాలేదు, అస‌లు అంత దూకుడుగా ఏ టీడీపీ ఎంపీ ఈ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేయ‌డానికి ముందుకు వ‌స్తారు అంటే ప్ర‌శ్నార్ధ‌క‌మే.. స‌మాచారం ప్ర‌కారం తెలుగుదేశం ఎంపీలు నిర‌వ‌ధికవాయిదాప‌డిన త‌ర్వాత ఫ‌కార్డులు ప‌ట్టుకుని కేంద్రం పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.