టీడీపీ మ‌రో భారీ కుట్ర‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-04 04:48:56

టీడీపీ మ‌రో భారీ కుట్ర‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ మ‌రో భారీ కుట్ర‌కు తెర‌లేపేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల వేళ ప్ర‌క‌టించిన హామీలు పూర్తి స్ధాయిలో నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో  తెలుగుదేశం ప్ర‌భుత్వంపై రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 
 
మ‌రోవైపు మిత్ర ప‌క్షంగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో తెగ‌దెంపులు చేసుకునేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌య్యే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో  ఉంచుకుని టీడీపీ నేత‌లు, ప్ర‌తిప‌క్ష  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓట్ల‌ను తొల‌గించే దిశ‌గా కుట్ర‌ను ప‌న్నుతున్న‌ట్లు  ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 
 
అధికారంలో ఉన్నందున తెలుగు త‌మ్ముళ్లు, ప్ర‌భుత్వ అధికారుల‌తో కుమ్మ‌క్కై ఓట్ల తొల‌గింపు ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టార‌ని వైసీపీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.  రాష్ట్రంలో  ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను పొందేందుకు అర్హ‌త గ‌ల‌ వారిని వివిధ కార‌ణాలతో అన‌ర్హులుగా  ప్ర‌క‌టిస్తున్న అధికార పార్టీ నేత‌ల‌కు ఓట్ల తొల‌గింపు వ్య‌వహారం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌నే చెప్ప‌వ‌చ్చు. రాష్ట్రంలో అప్ర‌జాస్వామిక‌ పాల‌న కొన‌సాగుతోంద‌ని  చెప్పేందుకు ఈ ఒక్క కార‌ణం చాలు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.