వెలుగులో టీడీపీ భారీ స్కామ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-23 15:10:29

వెలుగులో టీడీపీ భారీ స్కామ్

భోగాపురం ఏయిర్ పోర్ట్ నిర్మాణంలో భారీ లూటీకి రంగం సిద్దం అయింది. కోట్లాది రూపాయ‌ల‌ను క‌మీష‌న్ల‌ను కొట్టెయ్య‌డానికి అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొంద‌రు నాయ‌కులు వ్యూహాలు సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది.  గ‌తంలో సాగునీటి ప్రాజెక్ట్ మాదిరిగానే ఎయిర్ పోర్ట్ ప‌నుల‌ను ఆస్వాదీయుల‌కు క‌ట్ట‌పెట్టేందుకు త‌మ్ముళ్లు రెడి అయ్యారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా ఎప్ప‌టినుంచో ఆస‌క్తి చూపుతోంది. అలాగే ఎక్కువ రెవిన్యూ వాటా ఇస్తామ‌ని కూడా గ‌తంలో ధాక‌లు చేసిన బిడ్ల‌లో పేర్కింది. 
 
అయితే ఆసంస్థ నుంచి క‌మీష‌న్లు రావ‌ని మొత్తానికి టెండ‌ర్లను ర‌ద్దు చేశారు. తాజాగా ఆహ్వానించిన బిడ్ల‌లో ఏ.ఏ.ఐ పాల్గొనేందుకు వీలు లేకుండా వ్యూహం ప‌డ్డారు. బిడ్ల‌లో పాల్గొనే సంస్థ రియ‌ల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసి ఉండాల‌నే నిభంద‌న పెట్టారు. అయితే దీని వెనుక ఏ.ఏ.ఐ తొల‌గించే ప‌నిలో ఉంద‌ని తెలుస్తోంది. 4వేల 2వంద‌ల 9 కోట్ల‌ను ఖ‌ర్చు పెట్టి నిర్మించ‌నున్న ఈ ఎయిర్ పోర్ట్ లో కోట్లాది రూపాయ‌ల‌ను కొల్లగొట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చూస్తున్నార‌ని అనేక విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి.
 
అయితే వాస్త‌వానికి భోగాపురం విమానాశ్ర‌యం ఫైనాన్సియ‌ల్ బిడ్ల‌ను 2017 ఆగ‌స్ట్ 21న తెరిచారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి రెవిన్యూ వాటాగా 30.2 శాతం ఇవ్వ‌డంతో పాటు ఎక‌రానికి 20 వెల రూపాయ‌లు చెప్పున 26 శాతం ఈక్విటీ ఇస్తామ‌ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇక ఈ బిడ్ల‌లో పాల్గొన్న జీ.ఎమ. ఆర్ 21 శాతం మాత్ర‌మే రెవిన్యూ వాటా ఇస్తామ‌ని పేర్కొంది. దీంతో ఎక్కువ రెవిన్యూ వాటా ఇస్తామ‌న్నా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎయిర్ పోర్ట్ ప‌నుల‌ను అప్ప‌గించాల‌ని అర్ధిక శాఖ‌తో పాటు  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంబంధిత అధికారులు సిఫారస్సు చేశారు. అయితే ఏ.ఏ.ఐ నుంచి ముడుపులు క‌మీష‌న్లు రావ‌న్న నెపంతో పార్టీలో ఉన్న ముఖ్య‌నేత అద‌న‌పు ప‌నులు ఇంకా భూసేక‌ర‌ణ అవ‌స‌రం అంటూ ఈ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయించారు. 
 
అంతేకాదు అద‌న‌పు ప‌నుల‌ను చేయించేందుకు కూడా తాము సిద్ద‌మంటూ ఏ.ఏ.ఐ లేఖ రాయ‌టం టెండ‌ర్ల ర‌ద్దుపై పౌర‌విమాన‌యాన‌ శాఖ మంత్రి వివ‌ర‌ణ కోర‌డం ఏ.ఏ.ఐ కే ప‌నుల‌ను అప్ప‌గించ‌డం స‌ముచిత‌మ‌ని ఏపీ విమాశ్ర‌య డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సూచించ‌డంతో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇర‌కాటంలో ప‌డ్డారు. అయితే ఇప్పుడు బిడ్ల‌ను ఆహ్వానించినా ఏ.ఏ.ఐ పాల్గొంటే త‌మ ల‌క్ష్యం నెర‌వేర‌ద‌ని చాక‌చ‌క్యంగా అర్హత నిబంధన‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా రూపొందించారు. 
 
ఇదంతా బిడ్ల‌లో పాల్గొనేందుకు వీలులేకుండా ఏ.ఏ.ఐ క‌ట్ట‌డి చేసేందుకే అని అధికారిక వ‌ర్గాల్లో జోరుగా ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌మ‌కు ర‌క్ష‌ణ సంస్థ‌ను ఎంపిక చేసి ప‌నుల‌ను క‌ట్ట‌పెట్టేందుకే ఇలాంటి నిబంధ‌న‌లు తెర‌పైకి తీసుకువ‌చ్చార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 5 వేల 3మంద‌లు 11 ఎకరాల్లో భోగాపురం విమానాశ్ర‌యాన్ని తొలుత రెండు ద‌శ‌ల్లో పూర్తి చెయ్యాల‌ని నిర్ణ‌యించ‌గా ఇప్పుడు ఆ ప‌నుల‌ను మూడు ద‌శ‌ల్లో పూర్తి చెయ్యాల‌ని నిర్ణ‌యించారు. అయితే ఇందుకు గాను నిర్మాణ‌ వ్య‌యం 4వేల 2వంద‌ల 9 కోట్ల రూపాయాలు అవుతోంద‌ని ప్ర‌భుత్వం త‌న ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ నోటిఫికేష‌న్ లో పేర్కొంది. ఈ ప‌నుల‌ను అనుకూల కంపెనీకి అప్ప‌గించి తద్వారా కోట్ల‌ను కొల్ల‌గొట్ట‌డానికి ఓ ముఖ్య‌నేత వ్యూహం ప‌డ్డార‌ని తెలుస్తోంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.