టీడీపీ, బీజేపీ ఒక్కటయ్యారనేదానికి ఇదే రుజువు...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp and bjp
Updated:  2018-10-10 02:09:34

టీడీపీ, బీజేపీ ఒక్కటయ్యారనేదానికి ఇదే రుజువు...

ప్రత్యేక హోదా కోసం వైస్సార్సీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామా లు చేసి నిరాహార దీక్ష కు కూర్చున్న సంగతి తెలిసిందే.. అయితే ఆ రాజీనామాలను ఆమోదించే ప్రక్రియలో ఎంతో జాప్యం జరిగింది.. స్పీకర్‌ తన విచక్షణ మేరకు, ఎంపీల రాజీనామాలపై ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు. విచక్షణ మేరకు అంటే స్పీకర్ ఆ రాజీనామాలను ఆమోదించాలంటే అధికారులు నిర్ణయం అవసరం.. అధికారులు,  అసెంబ్లీ స్పీకర్‌ అయినా, లోక్‌సభ స్పీకర్‌ అయినా, అధికార పార్టీలకు చెందినవారే.

దాంతో, అధికార పార్టీ ఎలా నిర్ణయిస్తే.. సభాపతుల నిర్ణయం అలా వుంటుంది.అలా అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ, వైఎస్సార్సీపీని దెబ్బకొట్టింది. తమ రాజీనామాల్ని ఆమోదించాలంటూ పదే పదే లోక్‌సభ స్పీకర్‌కి వైసీపీ ఎంపీలు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. సరిగ్గా టైమ్‌ చూసి, ఇప్పుడు రాజీనామాల్ని ఆమోదిస్తే.. ఉప ఎన్నికలు రావనే నిర్ణయానికి వచ్చి.. అప్పుడు రాజీనామాలకు ఆమోదం లభించేలా బీజేపీ వ్యూహం రచించి, అమలు చేసింది. లేకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి.

చంద్రబాబుతో మా స్నేహం ఎప్పటికీ కొనసాగుతుంది..అంటూ సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే. ఆ స్నేహమే, వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదానికి కారణమా..? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే కదా మరి.! ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగి వుంటే.. ఇక్కడ, రాజకీయ సమీకరణాలు ఎలా మారేవో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేశారు గనుక, బంపర్‌ మెజార్టీతో మళ్ళీ వాళ్ళే గెలుస్తారు. అది అధికార తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే అయి ఉండేది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.