టీడీపీ ప్ర‌చారం వైసీపీకి విజ‌యం ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp-tdp image
Updated:  2018-03-31 02:37:16

టీడీపీ ప్ర‌చారం వైసీపీకి విజ‌యం ?

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ... ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌కుండా అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన విష‌యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోకెల్లా  నంబ‌ర్‌1 స్థానాన్ని చేజిక్కించుకున్న‌  విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా ధ‌నిక ముఖ్య‌మంత్రుల జాబితా వెల్ల‌డైతే అందులో అగ్ర స్థానాన్ని కైవ‌సం చేసుకున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.  
 
ప్ర‌భుత్వ పాల‌న‌లో ఉన్న లోపాల‌ను ప్ర‌శ్నించాల్సిన బాధ్య‌త ప్ర‌తిప‌క్షానిది. దీన్ని బాధ్య‌త‌గా నిర్వ‌ర్తించింది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను, అక్ర‌మాల‌ను, అవినీతిని నిగ్గ‌దీసి ప్ర‌శ్నించారు వైసీపీ నాయ‌కులు. దీంతో డీలా ప‌డిన ప‌సుపు నాయ‌కులు వైసీపీ పార్టీ పై, నాయ‌కుల‌పై  అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు,విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  ఏపీలో జ‌రుగుతున్న ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మాన్ని మొద‌లు పెట్టింది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న‌విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే.
 
ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మాన్ని అడ్డుపెట్ట‌కుని కేంద్రంతో కేసుల‌ను మాఫి చేయించుకుంటున్నార‌ని వైసీపీ పై  అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తోంది తెలుగుదేశం పార్టీ.... తాజాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని మోడీ కాళ్లను పట్టుకున్నారు  అనే ప్రచారాన్ని మొదలు పెట్టింది టీడీపీ. ఈ వార్త‌ను అధికార పార్టీ ఆస్థాన మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది.  ఈ వార్త నిజ‌మైతే టీడీపీకి ఆ వీడియోలను సంపాదించడం నిమ‌షం పని.  ఇప్ప‌టికే మూడు రోజులు అవుతున్నా ఆ వీడియోను సంపాదించ‌లేక పోయింది అని అంటే అది అవాస్త‌వం అని చెప్ప‌వ‌చ్చు.  
 
మ‌రో వైపు తనపై టీడీపీ చేసిన అన‌వ‌స‌ర‌ ఆరోపణలను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డానికి వీడియోల కోసం రాజ్యసభ సెక్రటరీకి  విజయసాయిరెడ్డి లేఖ రాశారు. రాజ్యసభ సెక్రటరీ వీడియోలు గ‌నుక స‌మ‌ర్పిస్తే టీడీపీ నిజ‌స్వ‌రూపాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. అలాగే సీఎం ర‌మేష్ కూడా ఇప్పుడు చెప్పొద్దు అన్న మాట ఏపీ అంతా వైర‌ల్ అయింది ఆరోప‌ణ‌లు చేసిన వారే ఇప్పుడు చెప్ప‌ద్దు అంటే అందులో వాస్త‌వం లేన‌ట్టే క‌దా అని అంటున్నారు ప్ర‌జ‌లు.దీంతో టీడీపీ చేసిన త‌ప్పుడు ప్ర‌చార‌మే వైసీపీని గెలిపిస్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.